కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 119

సినిమా వార్తలు

రేపటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్..!

లాక్ డౌన్ వల్ల ఇప్పటికే అనేక చిత్రాల షూటింగ్ మధ్యలో ఆగిపోగా, పూర్తి అయిన సినిమాల విడుదల ఆగిపోయాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు కొన్ని సడలింపులు చేసిన నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా అనుమతి కోసం ఎదురుచూస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే షూటింగ్స్ జరుగుతున్నాయి .ఇక ఏపీ ప్రభుత్వం కూడా షూటింగ్స్ కు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన అనుమతులనిచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి దీనిపై ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు.

TFN Adminవాట్సాప్
Namrata Shirodkar Gives A Sneekpeek In To Super Star Mahesh Babu Lavish Home Gym
సినిమా వార్తలు

మహేష్ బాబు పర్సనల్ జిమ్

"భరత్ అనే నేను", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు " వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ కు ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో మహేష్ బాబు పర్సనల్ జిమ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ తన జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ ఎఫెక్ట్ లో కియారా అద్వానీ

బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను " మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "అర్జున్ రెడ్డి " హిందీ రీమేక్ "కబీర్ సింగ్ " మూవీ లో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీ ఘనవిజయంతో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన "లక్ష్మీ బాంబ్ ", "ఇందూ కి జవానీ ", "షేర్ షా "," భూల్ భులయ్యా 2" మూవీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ "లిగర్ " ?

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్

మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ బర్త్ డే కు కార్తికేయ గిఫ్ట్

సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ "నాన్నకు ప్రేమతో " మూవీ లోని "ఐ వన్నా ఫాలో ఫాలో యు " సాంగ్ లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ కార్తికేయ ఒక వీడియో రూపొందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..!

మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..! నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ సెలబ్రిటీస్ అందరూ తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి తెలిసిందే. అయితే అందరు సెలబ్రిటీస్ చెప్పడం ఒక ఎత్తైతే...వర్మ ట్వీట్ మాత్రం మరో ఎత్తు. అందరికంటే భిన్నంగా స్పందిస్తాడు కాబట్టే వర్మ కాస్త డిఫరెంట్. ఇక నిన్న కూడా ఎన్టీఆర్ పిక్ పై అలానే స్పందించాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫొటో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిక్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పిక్ ను ట్వీట్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా రికార్డ్

మే 20వ తేదీ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీస్, అభిమానులు, ప్రేక్షకుల విషెస్ సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజు ను ఎన్టీఆర్ జరుపుకున్నారు. #HAPPY BIRTH DAY హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో దూసుకు పోయింది. 24 గంటలలో 21.5 మిలియన్ ట్వీట్స్ తో ఇండియా లో ట్రెండింగ్ టాపిక్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఎన్టీఆర్ కు ఉన్న పాప్యులారిటీ తెలియజేసింది.

Team TFNవాట్సాప్
Tollywood Actor Rana Daggubati Gets Engaged To Miheeka Bajaj At Ramanaidu Studios In Hyderabad
సినిమా వార్తలు

OFFICIAL! రానా -మిహికా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి మొత్తానికి ఒక ఇంటివాడవ్వబోతున్నాడు. ఇటీవల తన ప్రేమను మిహికా బజాజ్ ఒప్పుకుందని హీరో రానా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్‌ కల్లా పెళ్లి చేసేస్తామని ప్రముఖ నిర్మాత, రానా తండ్రి సురేష్ బాబు ఇదివరకే స్పష్టం చేశారు కూడా. అయితే నిన్న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక నిర్వహించినట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. లాక్‌డౌన్ నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. అంతేకాదు సురేష్ బాబు కూడా ఎంగేజ్ మెంట్ కాదు కేవలం మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పినట్టు కూడా వార్తలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘అడవి రాముడు’కి 16 ఏళ్ళు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పలు మాస్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘అడవి రాముడు’ ఒకటి. ఆర్తీ అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించారు. నాజర్, బ్రహ్మానందం, సాయికుమార్, రాళ్ళపల్లి, రాజీవ్ కనకాల, రంగనాథ్, వేణుమాధవ్, రవిబాబు, శివారెడ్డి, జి.వి.సుధాకర్ నాయుడు, అజయ్ రత్నం, ‘తెలంగాణా’ శకుంతల, బండ్ల గణేష్, సీమ‌ ముఖ్య పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో మెరిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన మొదటి సినిమా ‘రాముడు భీముడు’కి 56 ఏళ్ళు

సురేష్ ప్రొడక్షన్స్.. దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. పరాజయాల్లోనూ అవకాశాలుంటాయని నమ్మిన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అందుకే విజయాలు ఈ సంస్థ వెంటే నడిచాయి. అంతేకాదు.. దాదాపు అన్ని ప్ర‌ముఖ భార‌తీయ భాషల్లోనూ సినిమాలు నిర్మించిన ఘనత ఈ సంస్థది. అలాంటి సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘ‌ల్, స్టార్‌ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు నిర్మించిన మొట్ట మొదటి చిత్రం ‘రాముడు భీముడు’. మొద‌టి ప్ర‌య‌త్నంతోనే అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు డి.రామానాయుడు. ఈ చిత్రం కోస‌మే నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు తన కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేయ‌డం విశేషం. జమున, ఎల్.విజయలక్ష్మి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దృశ్యం`కి సీక్వెల్‌

‘దృశ్యం’.. 2013లో విడుదలైన ఈ మల‌యాళ చిత్రం మాలీవుడ్‌లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించి అప్ప‌ట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సింహళీ భాషల్లోనూ పునర్నిర్మితమై ఆయా చోట్ల మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. గత దశాబ్దంలోనే ఎక్కువ భాషల్లో రీమేక్ అవ‌డ‌మే కాకుండా.. చైనాలో రీమేక్ అయిన తొలి భార‌తీయ చిత్రంగానూ చరిత్ర సృష్టించింది. క‌ట్ చేస్తే.. 7 ఏళ్ళ త‌రువాత‌ ‘దృశ్యం’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించాడు మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్.

Team TFNవాట్సాప్
AP Government Gives Green Signal To Movie Shooting With Some Terms And Conditions
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - కండీషన్స్ అప్లయ్

లాక్ డౌన్ వల్ల ఎక్కడెక్కడి షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమాలే కాదు.. టీవీ సీరియళ్లు, పలు షోల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీనితో ఇండస్ట్రీ కి పెద్ద ఎత్తున నష్టమే కలిగింది. అయితే నాలుగోసారి లాక్ డౌన్ పొడిగించిన తర్వాత షూటింగ్స్ కు మాత్రం కొన్ని నిబంధనలతో షూటింగ్ లు చేసుకునేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు మూడు కేటిగిరిలుగా విభజించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్‌కి జోడిగా అలియా భట్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్‌ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కార్తి, త‌మ‌న్నా ‘ఆవారా’కి 10 ఏళ్ళు

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన పలు తమిళ సినిమాలు అనువాద రూపంలో తెలుగులోనూ విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాటిలో ‘ఆవారా’(తమిళంలో ‘పయ్యా’) ఒకటి. ఇందులో కార్తికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. యన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోనియా దీప్తి, మిలింద్ సోమన్, జగన్, అర్పిత్, జస్పేర్, రామచంద్రన్ దురైరాజ్, దర్శన్ జరీవాలా ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిత్ర ప్రముఖులతో చిరంజీవి మీటింగ్

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులకు లోనైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోయి, రిలీజ్ లు ఆగిపోయి చిత్ర పరిశ్రమ తీవ్రం గా నష్టపోయింది. ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు కరోనా తో జీవించాల్సిందే అన్న నేపథ్యం లో షూటింగ్స్ ప్రారంభానికై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో తన ఆఫీస్ లో రేపు (21 తేదీ) చిరంజీవి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna Is A Great Human Being Says Charmme Kaur
సినిమా వార్తలు

బాలకృష్ణ చాలా మంచి మనిషి..!

నందమూరి బాలకృష్ణ పైకి కాస్త గంభీరంగా.. కోపిష్టిగా కనపడినా ఆయన గురించి సినీ ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా మాత్రం చాలా మంచివారని.. చిన్న పిల్లల మనస్తత్వం అని చెపుతుంటారు. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ కూడా అదే చెబుతుంది. ఆమె ఎవరో కాదు ఛార్మి. హీరోయిన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఛార్మి.. తన కెరీర్లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకోలేక పోయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నటనకు దూరంగా వుంటూ.. పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది. ఇటీవలే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మణిరత్నం సినిమాలో నటించట్లేదు.. !

సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాలో నటించింది అయితే ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు కానీ అదితి కి మాత్రం ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ తో నటిస్తా - శ్రావణ భార్గవి

సింగర్ , డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. "బోణి " మూవీ తో శ్రావణ భార్గవి టాలీవుడ్ కు సింగర్ గా పరిచయం అయ్యారు. "సింహా " లో సింహమంటి చిన్నోడే , "దమ్ము" లో వాస్తు బాగుందే, "కెమెరా మెన్ గంగతో రాంబాబు" లో జొరమొచ్చింది , "S/O సత్యమూర్తి "లో సూపర్ మచ్చి వంటి సాంగ్స్ శ్రావణ భార్గవికి మంచి పేరు తెచ్చాయి. "లవ్ ఫెయిల్యూర్ ", "గబ్బర్ సింగ్ ", "ఈగ ", "రామయ్యా వస్తావయ్యా " మూవీస్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు.

Team TFNవాట్సాప్
KGF Director Prashanth Neel Gives Hint To Audience With His Birthday Wish
సినిమా వార్తలు

ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చినట్టేనా..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇక సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్