య‌ంగ్ టైగ‌ర్ యన్టీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌గా విడుద‌లైన తొలి చిత్రం ‘నరసింహుడు’కి 15 ఏళ్ళు

Young tiger NTR First Birthday Release Movie Narasimhudu Completes 15 Years

‘యంగ్ టైగర్’ యన్టీఆర్ అంటేనే యాక్టింగ్ పవర్ హౌస్. త‌న సినిమాల తీరుతెన్నులు ఎలా ఉన్నా తన ప‌ర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను క‌ట్టిప‌డేస్తాడు తార‌క్‌. అలా యన్టీఆర్ త‌న అభిన‌యంతో ఆడియ‌న్స్‌ను అల‌రించిన చిత్రం ‘నరసింహుడు’. కెరీర్ ఆరంభం నుంచి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో థియేటర్‌ల‌లో అభిమానులతో చ‌ప్ప‌ట్లు కొట్టించే తారక్.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఆక‌ట్టుకోవ‌డం విశేషం. ‘అల్లరి రాముడు’(2002) తరువాత యన్టీఆర్, అగ్ర‌శ్రేణి దర్శకుడు బి.గోపాల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో యన్టీఆర్‌కి జోడిగా సమీరా రెడ్డి, అమీషా పటేల్ నటించారు. కైకాల సత్యనారాయణ, తనికెళ్ళ భరణి, అలీ, బ్రహ్మానందం, చలపతిరావు, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, పునీత్ ఇస్సార్, కళాభవన్ మణి, రాహుల్ దేవ్, జయచిత్ర, మనోరమ, రాళ్ళపల్లి, నర్రా వెంకటేశ్వరరావు, జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, ‘చిత్రం’ శ్రీను ముఖ్య పాత్రలు పోషించగా.. ఆర్తీ అగర్వాల్ ప్రత్యేక గీతంలో మెరిసింది.

ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందించగా వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చారు. “సింగు సింగు”, “ఏలుకో నాయకా”, “ముద్దొచ్చే కోపాలు”, “ముద్దుల గోపాలా”, “కృష్ణమురారికి”, “రాజమండ్రికే”.. ఇలా ఇందులోని పాటలన్నీ అభిమానులను అలరించాయి. శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ నిర్మాత చెంగల వెంకటరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2005 మే 20న విడుదలైన ‘నరసింహుడు’.. నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here