ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్…?

Jr NTR Gives Bulk Dates For KGF Director Prashanth Neel New Movie
Jr NTR Gives Bulk Dates For KGF Director Prashanth Neel New Movie

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ప్రస్తుతం ప్రశాంత్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, హిందీ భాషాల్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమా కోసం ఏడాది పాటు డేట్స్ కేటాయించడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. చిత్రాన్ని ఎక్కడా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా చేద్దామని ఎన్టీఆర్ దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. రేపు ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి, ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. మరి చూద్దాం ఏదైనా ప్రకటన వస్తుందో రాదో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =