కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 118

సినిమా వార్తలు

మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'భారతీయుడు2' లొకేషన్ ఛేంజ్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకు మొదటినుండి పలు అడ్డంకులే ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. వాటన్నిటిని తట్టుకొని ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను జరుపుకోగా.. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ స్పాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా వచ్చి పడి ఇంకా పెద్ద బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
COVID 19 Cant Stop Telugu Audience From Watching Movies
సినిమా వార్తలు

సినిమాని చూడాలన్న ప్రేక్షకుల కోరికని 'కోవిడ్-19' ఆపలేదు..!

పుట్టిన ప్రతి మనిషి తాను ఏ రంగంలో రాణించినా, రాణించకున్నా.. సంపాదించినా సంపాదించుకున్నా.. అలసిపోయినా, ఆనందంగా ఉన్నా.. తన దినచర్యలో ఒక్కసారైనా.. సినిమాని చూడాలి, సినిమా గురించి వినాలి, సినిమా గురించి మాట్లాడాలి అని అనుకుంటూనే ఉంటాడు. అసలు సినిమా ఊసులు లేకపోతే పొద్దే పోనివాళ్లు అసంఖ్యాకం, అనేకం అంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైతే వాడికి 'సినిమా-కష్టాలు' వచ్చాయి అంటుంటారు. అటువంటిది ఈ 'కోవిడ్-19' రూపంలో సినిమాకి, సినిమావాళ్ళకి నిజంగానే 'సినిమా-కష్టాలు' వచ్చి పడ్డాయి. ఓ రకంగా చూస్తే సినిమాకి కష్టాలు రావడం వాటిని తట్టుకుని సినిమా నిలబడటం సినిమాకి కొత్త ఏమీ కాదు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు

సినిమా షూటింగ్స్ అనుమతుల గురించి చర్చించేందుకు గాను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో సినీపెద్దలు కేసీఆర్ తో పలు విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సీఎం జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిని చెప్పినట్టు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని..షూటింగ్ లోకేషన్స్‌లో లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని, లోకేషన్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని కేసీఆర్‌ సూచించినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'చిరుత' సినిమాకు సీక్వెల్ వస్తే బావుంటుంది..!

నేహా శర్మ చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా చిరుత. ఈ సినిమాతోనే చరణ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శర్మ నటించింది. ఈ సినిమాలో పెద్ద బిజినెస్ మేన్ కూతురిగా... పొగరు పాత్రలో బాగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక చిరుత తర్వాత కుర్రాడు సినిమా చేసింది. ఇక ఆ సినిమా తర్వాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందులోనూ నేహా శర్మ కూడా బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో ఇక్కడ అవకాశాలు రాలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ హీరోయిన్ టాప్ త్రీ లో ఉంటుంది..!

ఫ్యూచర్ లో ఆ హీరోయిన్ టాప్ త్రీ ప్లేస్ లో ఉంటుందని అంటుంది చార్మీ. ఇంతకీ ఛార్మి ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతుంది.. ఏ హీరోయిన్ ఫ్యూచర్ గురించి చెపుతుంది అని అనుకుంటున్నారు కదా.. ఇంకెవరూ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా అనన్య పాండే నటిస్తుంది. ఈ సినిమాకు ఛార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి కూడా విదితమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"దృశ్యం" మూవీ సీక్వెల్

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన "దృశ్యం " మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. "దృశ్యం " మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహ లీస్ భాషలలో రీమేక్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించింది. చైనీస్ భాష లో రీమేక్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ గా "దృశ్యం " రికార్డ్ క్రియేట్ చేసింది. "దృశ్యం " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా కేరళ స్టేట్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు, తమిళ , మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు చిత్రాలలో నటిస్తూ కీర్తి సురేష్ బిజీ గా ఉన్నారు. తెలుగు లో "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే " మూవీస్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళ భాషలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న "అన్నాత్తే " మూవీ లో నటిస్తున్నారు . కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళం ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Plans Go Haywire Due To Lockdown
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ ప్లాన్స్ తారుమారు

కరోనా మహమ్మారి కారణం గా మూవీ షూటింగ్స్ , రిలీజ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యారు . తెలుగు, తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకూ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ టైమ్ పాస్ చేసిన రకుల్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యి బోర్ ఫీల్ అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్క్ ధరించడం తప్పనిసరి..!

లాక్ డౌన్ నాలుగోసారి కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో లాగ కాకుండా కొన్ని సడలింపులు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. షూటింగ్స్ కు కూడా కొన్నిషరతులతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే అనుమతులు ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియో

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా కు ఇన్ స్టా గ్రామ్ లో 10.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను తమన్నా అలరిస్తున్నారు. తమన్నా లేటెస్ట్ గా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియోను షేర్ చేశారు. ట్రైనర్ సూచనలతో తలని బ్యాలెన్స్ చేస్తూ హెడ్ స్టాండ్ పొజిషన్ చేశానని , కొన్ని సార్లు ఫెయిల్ అయినా రైట్ పొజిషన్ కు చేరుకున్నానని , పర్ ఫెక్ట్ పొజిషన్ చేరేవరకు ప్రాక్టీస్ చేయాలని, ఎన్నో సార్లు ట్రై చేసిన తరువాత హెడ్ స్టాండ్ ఫీట్ సాధించానని , ట్రైనర్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దని తమన్నా చెప్పారు.

Team TFNవాట్సాప్
We Cant Predict Exactly When Theaters Will Reopen Says Tollywood Ace Producer Dil Raju
సినిమా వార్తలు

థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేం..!

సినిమా షూటింగ్ లపై.. ఎలాంటి కార్యాచరణలు తీసుకోవాలి అన్న విషయాలపై నిన్న మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖనిర్మాతలు, డైరెక్టర్స్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో సినిమాల షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. రేపటి నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకోవడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించాలని తెలిపారు.

TFN Adminవాట్సాప్
Maharshi Actress Pooja Hegde To Pair Up With Dulquer Salmaan
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ కు జోడీగా పూజాహెగ్డే

బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న పూజాహెగ్డే మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "అందాల రాక్షసి ", కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ", "పడి పడి లేచె మనసు" మూవీస్ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడు గా ఒక తెలుగు మూవీ రూపొందనుంది.ఈ మూవీ లో పూజాహెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రానా-మిహికా నిశ్చితార్ధ వేడుకలో 'చైసామ్' ల సందడి..!

మొన్న రానా-మిహిక నిశ్చితార్ధ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయాన్నే రానా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పడంతో ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలిసిందే. లేకపోతే అయ్యిందా? అవ్వలేదా?అన్న కన్ఫ్యూజన్ లోనే ఉండేవాళ్ళు. కేవలం కుటుంబ సభ్యులు.. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హడావుడి లేకుండా సింపుల్ గా కానిచ్చేశారు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందనిఇప్పటికే సురేష్ బాబు చెప్పారు. అయితే అంతకన్నా ముందు జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదు.

TFN Adminవాట్సాప్
Legendary Director K Raghavendra Rao Sensational Movie Mosagadu Completes 40 Years.
సినిమా వార్తలు

శోభన్‌బాబు, చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ మూవీ ‘మోసగాడు’కి 40 ఏళ్ళు

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అతిలోకసుందరి శ్రీదేవిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో దాదాపు 23 చిత్రాలు (తెలుగు, హిందీ కలిపి) తెరకెక్కగా.. వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అలాంటి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రాల్లో ‘మోసగాడు’ ఒక‌టి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం పోషించిన తొలి చిత్రంగా ఈ సినిమాకి ప్రత్యేక స్థానముంది. ఇందులో నటభూషణ్ శోభన్‌బాబు కథానాయకుడిగా నటించగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రతినాయకుడి పాత్రలో దర్శనమిచ్చారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, అల్లు రామలింగయ్య, సారథి, చలపతిరావు, పి.జె.శర్మ, నిర్మలమ్మ, అనిత, జయమాలిని ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Mythological Masterpiece Annamayya Completes 23 Years.
సినిమా వార్తలు

నాగార్జున తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’కు 23 ఏళ్ళు

వాణిజ్యపరమైన సినిమాలతోనే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించిన వైనం ‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ద్వ‌యం సొంతం. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’. త‌న కీర్త‌న‌ల‌తో ఆ పరంధాముడి హృదయ సామ్రాజ్యాన్నే ఏలిన కవి మహారాజు ‘అన్నమయ్య’ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. అటు నాగార్జునకు, ఇటు దర్శకేంద్రుడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ, కస్తూరి నటించగా.. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌లో సుమ‌న్ ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇక శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించారు. డా.మోహన్‌బాబు, రోజా, బాలయ్య, శుభ…

Team TFNవాట్సాప్
Victory Venkatesh Wholesome Family Entertainer Intlo Illalu Vantintlo Priyuralu Completes 24 Years.
సినిమా వార్తలు

వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’కి 24 ఏళ్ళు

తెలుగునాట అగ్ర కథానాయకుడు ‘విక్టరీ’ వెంకటేష్, అగ్ర కథానాయిక సౌందర్య కాంబినేషన్‌కి ప్రత్యేక స్థానముంది. వీరిద్దరి కలయికలో ఏడు చిత్రాలు తెరకెక్కగా వాటిలో ఐదు సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం. వాటిలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఒకటి. అగ్రశ్రేణి దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ ముఖ్య భూమికలు పోషించారు. త‌మిళ చిత్రం 'తాయ్‌కుల‌మే.. తాయ్‌కుల‌మే..' ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Team TFNవాట్సాప్
Young Rebel Star Prabhas and Trisha Hat trick Movie Bujjigadu Completes 12 Years.
సినిమా వార్తలు

‘బుజ్జిగాడు’గా ప్ర‌భాస్‌కి 12 ఏళ్ళు

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్‌కి అచ్చొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘వర్షం’ ఘ‌న‌విజ‌యం సాధించ‌గా.. రెండో సినిమా ‘పౌర్ణమి’ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అలాంటి స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన థ‌ర్డ్ ఫిల్మ్ ‘బుజ్జిగాడు’. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించగా ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఇందులో డా.మోహన్ బాబు కీలక పాత్రలో దర్శనమివ్వగా.. సంజన, కోట శ్రీనివాసరావు, సునీల్, యం.యస్.నారాయణ, అలీ, హేమ, అజయ్, సుబ్బరాజు, సుప్రీత్, ‘ఆహుతి’ ప్రసాద్, సుధ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇప్పుడు నా వంతు.. కానీ మహేష్ గెలిచాడు..!

లాక్ డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ సినిమాలకు సంబంధించి అప్ డేట్ ఇవ్వడానికి ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్న వీడియోలను మాత్రం రోజుకొకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది నమ్రత. ముఖ్యంగా సితార చేస్తున్న అల్లరి, డాన్స్, సాంగ్స్ పాడటం, ఇంకా మహేష్ బాబు సితార, గౌతమ్ తో కలిసి గడుతున్న స్వీట్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోస్ సూపర్ స్టార్ ఫ్యాన్ కి కను విందు కలిగిస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ, ర‌మేష్ వ‌ర్మతో సినిమా చేస్తున్నాం

మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి దశకు వచ్చేసింది. ఒక పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదటి వారంలో రిలీజ్ కావాల్సి వుంది కానీ లాక్ డౌన్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్