ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 106
'బాహుబలి' కంటే 'అరణ్య' షూటింగ్ కష్టమనిపించింది..!

మీ అందరికీ ధన్యవాదాలు
నా కూతురిని షూటింగ్స్ కు పంపించేది లేదు..!
మళ్లీ పెళ్లి చేసుకోనంటున్న అల్లు అర్హ
రవితేజ కోసం బాలీవుడ్ హీరోయిన్..!
సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’ కు క్లీన్ 'U'
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న 'బాహుబలి'
ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్

సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది
ఒకే సినిమాలో అక్కాచెల్లెళ్లు..!
ఆగష్ట్ లో లాస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న `సీటీమార్`
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
నిత్య మీనన్ న్యూ ట్యాలెంట్

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?

100 రోజుల తరువాత తిరిగి ఇంటికి మంచు వారి కోడలు
సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే
అందరి కన్ను రాజమౌళి షూటింగ్ పైనే..!
లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ లు కూడా మొదలవనున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అనుమతులు అయితే తెచ్చుకున్నారు కానీ ఇప్పట్లో షూటింగ్ లు మొదలు పెట్టడానికి మాత్రం కాస్త ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ పలు నిబంధనలు పెట్టడమే దీనికి కారణం. అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే మరి కష్టమైన పనే కాబట్టి కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది.
'బాహుబలి' కంటే 'అరణ్య' షూటింగ్ కష్టమనిపించింది..!
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్నఈ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.

'పెంగ్విన్' 18రోజుల్లో స్క్రిప్ట్.. 36రోజుల్లో షూట్..!
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'పెంగ్విన్'. ఈ నెల 19 వ తేదీన ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా చేసేశారు. ఇక వాటికి మంచి రెస్పాన్స్ రావడంతోసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొడుకు కోసం ప్రమాదాలకు ఎదురెళ్లి, సైకో కిల్లర్ ని ఎదిరించిన లేడీ పాత్రలో సురేష్ నటన సినిమాకు మరో ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. అంతేకాదు ఈ…

మీ అందరికీ ధన్యవాదాలు
కరోనా వల్ల సెలబ్రిటీస్ షూటింగ్స్ మాత్రమే కాదు తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలకు కూడా దూరంగా వుంటున్నారు. ఇక ఈ సందర్భంగా `కింగ్` నాగార్జున కూడా తన పెళ్లిరోజు వేడుకలను చాలా సింపుల్ గా జరుపుకున్నారు. నాగార్జున, అమల నిన్న తమ 28వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు నాగ్, అమలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. వీరందరికి నాగార్జున ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. `ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండ`ని నాగార్జున ట్వీట్ చేశారు. అమలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇక ఎప్పుడూ…
నా కూతురిని షూటింగ్స్ కు పంపించేది లేదు..!
నా కూతురిని షూటింగ్స్ కు పంపించేది లేదు అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. గత మూడు నెలల నుండి ఇంట్లోనే ఉంటుండగా..ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కు మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం అవుట్ డోర్ లు ప్లాన్ లు చేయకుండా ఇన్ డోర్ షూటింగ్ లు మొదలుపెట్టి.. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత విదేశాల్లో ప్లాన్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరుకాను అంటున్నారు. అంతేకాదు తన కూతురు శ్రద్దా కపూర్ ని కూడా షూటింగ్స్ పంపనని చెప్పేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. మున్ముందు పరిస్థితులు…
మళ్లీ పెళ్లి చేసుకోనంటున్న అల్లు అర్హ
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక తాజాగా ఇప్పుడు అర్హ కు సంబందించిన మరో వీడియోను రిలీజ్ చేశారు. గతంలో అల్లు అర్జున్ ఒక వీడియో లో నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పమంటే, చేసుకోను అంటూ టక్కున అర్హ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న అర్హ ను అడగగా…
రవితేజ కోసం బాలీవుడ్ హీరోయిన్..!
రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి "ఖిలాడి " టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక లాక్డౌన్ ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే గ్రాండ్‌గా సినిమాని లాంచ్ చేస్తామని... ఏ మధ్యలో ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని నమ్మొద్దని ఆయన గతంలోనే అన్న సంగతి గుర్తుండే ఉంటుంది కదా…
సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’ కు క్లీన్ 'U'
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు సూర్య నటన చాలా బావుందని.. సినిమాలో హైలెట్ అవుతుందని సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను అభినందించారట.
'శివశంకరీ' పాట ట్రోలింగ్ పై బాలయ్య రియాక్షన్
నందమూరి బాలకృష్ణ స్వభావం గురించి తెలిసిందే. పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనిది మాత్రం చిన్నపిల్లల స్వభావమే అని అందరూ అంటుంటారు. అంతేకాదు తనపై వచ్చే విమర్శలను కూడా చాలా లైట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్ పై చాలా సున్నితంగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన బాలయ్య.. తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు…
ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న 'బాహుబలి'
జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటగా తాజాగా ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ తనవంతుగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు నామినేట్ చేస్తున్నాను అని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రభాస్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో తమ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా.. బయటకు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు పలు వీడియోల ద్వారా కనిపిస్తూనే వున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇంతవరకూ కనిపించింది లేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్.. ఇప్పుడు ఫైనల్ గా కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ తాజాగా గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తాజాగా టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు…

సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది
బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా..బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సినిమా టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై బాలకృష్ణ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్ ఇది మూడో సినిమా.. ఎక్కడా టెన్షన్ తీసుకోవడం లేదు...సినిమా హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది…
ఒకే సినిమాలో అక్కాచెల్లెళ్లు..!
రాజశేఖర్, జీవితలతనయలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో కనిపించబోతున్నారా..? ఇప్పుడు టాలీవుడ్ లో ఈ వార్తలే వినిపిస్తున్నాయి. గరుడ వేగ ఫేం ప్రవీణ్ సత్తారు త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించనుండగా, ఇందులో శివాత్మిక, శివానీ ఇద్దరూ కలిసి నటించనున్నటు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను జీవిత నిర్మించనున్నట్టు కూడా సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
ఆగష్ట్ లో లాస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న `సీటీమార్`
ప్రస్తుతం హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడుఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విజయ్ పై ప్రేక్షక , అభిమానులలో క్రేజ్ పెరిగింది. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ స్టార్ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక .
నిత్య మీనన్ న్యూ ట్యాలెంట్
బ్లాక్ బస్టర్ "అలా మొదలైంది " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిత్య మీనన్ ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్ అందుకున్నారు. నిత్య మీనన్ నటించిన "ఇష్క్ ", జబర్దస్త్ ", "గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు "," S/O సత్యమూర్తి ", జనతా గ్యారేజ్" మూవీస్ ఘనవిజయం సాధించాయి. "గుండె జారి గల్లంతయ్యిందే ", "మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు " మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ నిత్య అందుకున్నారు.

నితిన్ కు జోడీగా నభా నటేష్ ?
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "భీష్మ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ ప్రస్తుతం "రంగ్ దే ", చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే "పవర్ పేట " మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

100 రోజుల తరువాత తిరిగి ఇంటికి మంచు వారి కోడలు
ఈ లాక్ డౌన్ వల్ల కొంతమందికి తమ కుటుంబాలతో గడిపే సమయం దొరికితే.. కొంతమంది మాత్రం అదే కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క పక్క రాష్ట్రాల వారే అటు ఇటు వెళ్ళడానికి లేకుండా పోయింది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎంతోమంది మధ్యలో ఇరుక్కుపోయారు. ఇక్కడికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆగిపోయారు. మంచు విష్ణు భార్య విరనికా కూడా దాదాపు 3 నెలల నుండి సింగపూర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. `వందేభారత్ మిషన్`లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు వంద…
సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్
మొత్తానికి టాలీవుడ్ లో ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి ఎక్కువైంది. అదేం విచిత్రమో కానీ ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఒక పక్క కరోనా ఉన్నా కూడా లెక్కచేయకుండా పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ పెళ్లి జరిగిపోయింది. రానా పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. నితిన్ కూడా లైన్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు అలా పెళ్లి వార్తలు వచ్చాయో లేదో ఇలా నిశ్చితార్థం చేసేసుకున్నాడు సాహో డైరెక్టర్ సుజీత్. ప్రవల్లిక అనే డెంటిస్ట్‌తో సుజీత్ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో సుజీత్-ప్రవళికల నిశ్చితార్థం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఎంగేజ్ మెంట్ చాలా…
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే
సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 "మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అనన్య పాండే నటించిన "పతి పత్ని ఔర్ వో " మూవీ ఘనవిజయం సాధించింది. అనన్య ప్రస్తుతం "ఖాలీ పీలీ " మూవీ లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనన్య టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.