ఒకే సినిమాలో అక్కాచెల్లెళ్లు..!

Tollywood Actor Rajasehkar Daughters Shivani and Shivathmika To Share Screen Space Together
Tollywood Actor Rajasehkar Daughters Shivani and Shivathmika To Share Screen Space Together

రాజశేఖ‌ర్, జీవితలత‌న‌యలు శివానీ, శివాత్మిక ఒకే సినిమాలో కనిపించబోతున్నారా..? ఇప్పుడు టాలీవుడ్ లో ఈ వార్తలే వినిపిస్తున్నాయి. గ‌రుడ వేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నుండ‌గా, ఇందులో శివాత్మిక, శివానీ ఇద్దరూ కలిసి నటించనున్నటు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను జీవిత నిర్మించ‌నున్నట్టు కూడా సమాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్ర‌క‌ట‌న ఇవ్వనున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అప్పట్లో శివాని టూ స్టేట్స్‌ తెలుగు రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంది. అడవిశేష్‌, శివానీ కాంబోలో ఫైనల్‌ చేసిన ఈ ప్రాజెక్టు 2018లో లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లగా..కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. త్వ‌ర‌లో తేజ స‌జ్జా ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. రొమాంటిక్ చిత్రంగా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇక శివాత్మికఇప్పటికే దొర‌సాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమాలో శివాత్మిక తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.