సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల రిలీజ్ మాత్రం ఆపాల్సి వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు సూర్య నటన చాలా బావుందని.. సినిమాలో హైలెట్ అవుతుందని సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్ ను అభినందించారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సూర్య నిర్మిస్తున్నారు. మారా అనే పైలెట్ పాత్రలో సూర్య కనిపించనున్నారని తెలుస్తోంది. అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీవీప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నికేత్ బొమ్మి.
కాగా సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరి ఈ సినిమా కమర్షియల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: