
నందమూరి బాలకృష్ణ స్వభావం గురించి తెలిసిందే. పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనిది మాత్రం చిన్నపిల్లల స్వభావమే అని అందరూ అంటుంటారు. అంతేకాదు తనపై వచ్చే విమర్శలను కూడా చాలా లైట్ గా తీసుకుంటారు. ఇప్పుడు మరోసారి తనపై వస్తున్న ట్రోలింగ్ పై చాలా సున్నితంగా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటను బాలకృష్ణ స్వయంగా పాడి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటపై సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తలెత్తాయి. ఇక ఈ విమర్శలపై స్పందించిన బాలయ్య.. తన తండ్రి తనకు స్ఫూర్తి ప్రదాత అని ఆయన చెప్పారు. ఆయన నటించిన ఆ సినిమాలోని ఈ పాటంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. తాను ఈ పాట పాడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానని, అందుకే తాను బాగా సాధన చేశానని తెలిపారు. ఈ పాటను గొప్పగా పాడానని తాను అనడం లేదని, ఓ ప్రయత్నం మాత్రం చేశానని తెలిపారు. తాను పాడగలిగినంత బాగా పాడానని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదే పుట్టినరోజు నాడు బాలయ్య-బోయపాటి సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. అంతే కాదు ఈ సినిమా విజయం పై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ.
ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























