కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 107

ట్రైలర్ & టీజర్

'పెంగ్విన్' ట్రైలర్ రిలీజ్

ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'పెంగ్విన్'. ఇక ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను తెలుగులో నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్‌లాల్ రిలీజ్ చేశారు. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి నటన సూపర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ పై శృతి హాసన్ ప్రశంసలు

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ , స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం రవి తేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళ రీమేక్ లో రాజశేఖర్ ?

సక్సెస్ ఫుల్ "ప్రతిఘటన "(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజశేఖర్ నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. "తలంబ్రాలు " మూవీ కి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ , "మగాడు ", "అన్న " మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా రాజశేఖర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రాజశేఖర్ నటించిన "PSV గరుడ వేగ " మూవీ ఘనవిజయం సాధించగా "కల్కి " మూవీ నిరాశ పరచింది. రాజ శేఖర్ ఇప్పుడు ఒక మలయాళ రీమేక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవర్ ఫుల్ కాంబినేషన్ - తెరపైకి రోజుకో టైటిల్..!

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా.. అసలు ఇంకా సినిమా ఉంటుందో?లేదో? అధికారికంగా ప్రకటించలేదు.. ఒకవేళ ఉన్న ఇప్పట్లో ఉంటుందో లేదో కూడా తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ పై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. నిజానికి అధికారికంగా ప్రకటించకపోయినా సినిమా అయితే ఉందన్నది ఇప్పటికే పలు హింట్స్ ద్వారా అర్థమైపోయింది. మరి ఒకసారి కన్ఫామ్ అయితే వార్తలు ఆపడం కష్టమే కదా. అలా సినిమాపై కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న వార్త ఏంటంటే. టైటిల్ విషయంలో.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు మనవరాలి క్యూట్ క్లీనింగ్ వీడియో..

కరోనా వల్ల నిత్యం సినిమాలతో బిజిబిజీగా గడిపే నటీనటులు ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. కొందరు పిల్లలతో, మరికొందరు మనవడు, మనవరాళ్లతో ముచ్చట్లు చెబుతూ లాక్‌డౌన్‌ను టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక చిరు కూడా ఇంట్లో సరదాగా టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు తన మనవరాలు అల్లరికి సంబంధించిన క్యూట్ వీడియోస్ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో నీవిష్క చిన్న చీపురు పట్టుకొని ఊడుస్తుంది. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేసిన చిరు..కరోనా నేపథ్యంలో క్లీనింగ్ చేస్తుంది అంటూ చిన్న కాప్షన్ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అసురన్' చైనీస్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం కామనే కాబట్టి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నారప్పగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్
No Changes In Rana Daggubati & Miheeka Bajaj Marriage Date
సినిమా వార్తలు

రానా పెళ్లి మాత్రం జ‌రిగే తీరుతుంది..!

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా దగ్గుబాటి కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ప్రకటించిన వెంటనే ఇలా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని షాకిచ్చాడు. అయితే లాక్ డౌన్ అయిపోయిన తరువాతఈ ఏడాది చివరిలో పెళ్లి జరపాలనుకున్నారు కానీ ఆగస్ట్‌ 8న పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే గత రెండు రోజుల నుండి వివాహం వాయిదా పడ్డట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసే అవ‌కాశాలున్నాయంటూ కొన్ని వార్త‌లు వెలువ‌డ్డాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నీహారిక తమిళ మూవీ ప్రారంభం

"ఒక మనసు "మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన మెగా డాటర్ నీహారిక హ్యాపీ వెడ్డింగ్ ", " సూర్యకాంతం " మూవీస్ లో నటించారు. పలు వెబ్ సిరీస్ లో నటించిన నీహారిక , విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన "ఓరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ " తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. నీహారిక ఇప్పుడు మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Video of Payal Rajput Feeding Cows Goes Viral
సినిమా వార్తలు

మరో కోణం లో పాయల్ రాజ్ పుత్

సూపర్ హిట్ "RX 100" మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం ఫైటర్ పైలెట్ గా "నరేంద్ర "తెలుగు మూవీ లో నటిస్తున్నారు. తమిళమూవీ "ఏంజెల్ "తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో పాయల్ ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"అలివేలు మంగ వెంకటరమణ " ఆన్ లైన్ ఆడిషన్స్

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా "అలివేలు మంగ వెంకటరమణ " మూవీ రూపొందనుంది. "లక్ష్మీ కళ్యాణం "మూవీ తో కాజల్ అగర్వాల్ , "జయం "మూవీ తో నితిన్ , "చిత్రం "మూవీ తో ఉదయ్ కిరణ్, "జై " మూవీ తో నవదీప్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన తేజ ఇప్పుడు "అలివేలు మంగ వెంకటరమణ" మూవీ కి హీరో హీరోయిన్స్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ కు కొత్తవారిని పరిచయం చేయాలని నిర్ణయించారు.

Team TFNవాట్సాప్
Jr NTR To Play A Stylish NRI Role
సినిమా వార్తలు

స్టైలిష్ ఎన్నారై పాత్రలో ఎన్టీఆర్ ?

వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ కై భారీ అంచనాలతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR30 " మూవీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Mahesh Babu Wishes Natasimha Nandamuri Balakrishna on his birthday
సినిమా వార్తలు

ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు మీరు

నందమూరి బాలకృష్ణ ఈ రోజు 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, వెంకీ ఇలా పలువురు ఇప్పటికే తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా బాలకృష్ణకు తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. ఎనర్జీకి పవర్ హౌస్ లాంటి వారు, నేను ఎప్పుడూ అభిమానించే హీరో బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్మ స్పీడ్ మాములుగా లేదుగా..!

ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా.. ఎప్పుడు షూటింగ్ లు మొదలు పెడదామా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు.. మొత్తానికి సినీ పెద్దలందరూ కలిసి ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నారు. మరికొద్దిరోజుల్లో అందరూ షూటింగ్లు మొదలుపెట్టుకోనున్నారు. అయితే ఈ అనుమతులు.. లాక్ డౌన్ మాత్రం వర్మకు కాదనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ పరిస్థితుల్లో షూటింగ్లు ఎలా చేయాలబ్బా అని తలలు పట్టుకుంటుంటే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. ఇప్పటికే మియా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్లీ సెట్స్ పైకి ధనుష్ - నాగార్జున సినిమా..!

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్

మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో శృతి హాసన్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. శృతి నటించిన "గబ్బర్ సింగ్ ", "బలుపు ", "ఎవడు ", రేసుగుర్రం ", "శ్రీమంతుడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. శృతి ప్రస్తుతం తెలుగు లో రవితేజ హీరోగా రూపొందుతున్న "క్రాక్ " , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం " (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

స్పెషల్ సాంగ్స్ అందుకే చేస్తున్నా..!

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ లకు నిబంధనలతో కూడిన అనుమతులు రావడంతో చిన్నగా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇంకా కొద్దిరోజులు మాత్రం ఇంట్లోనే కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక రకంగా ఈ లాక్ డౌన్ సెలబ్రిటీస్ కి కలిసొచ్చిందని చెప్పొచ్చు. షూటింగ్స్ , ఓపెనింగ్స్, ఫోటో షూట్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే వారికి కాస్త కుటుంబంతో గడిపే టైమ్ దొరికింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ తమన్నా కూడా ఇప్పుడు దొరికిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా తమ వీడియోస్ ను, ఫొటోస్ ను.. ఎప్పటికప్పుడు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాయం చేద్దాం - కాజల్ అగర్వాల్

కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ సమయం లో రెండున్నర నెలలపాటు ఇంటికే పరిమితం అయిన ప్రజలు అన్ లాక్ 1.0 తో తమ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నులయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా పిల్లలు , వృద్ధులు పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న విషయం తెలిసిందే. పిల్లలు , వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో వారిని బయటకు వెళ్ళనీయొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా హీరోల పై తమన్నా ప్రశంసలు

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా లాక్ డౌన్ సమయం లో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. తమన్నా రీసెంట్ గా హలో యాప్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అనిరుధ్ రవిచంద్రన్ హీరోగా సినిమా నిర్మించాలని ఉంది..!

‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. గత ఏడాది పి.ఎస్‌. మిత్రన్‌ దర్శకత్వంలో ‘హీరో’ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాను తెలుగులో హీరో పేరుతో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. కే.జి.ఆర్‌ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్‌ నటుడు అభయ్‌ డియోల్‌ కీలక పాత్రలు చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు

ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ తో పాటు పలువురు బాలకృష్ణ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. ప్రియమైన బాలకృష్ణా... నువ్వు అరవైల్లోకి అడుగుపెట్టావు. నీ…

TFN Adminవాట్సాప్

షేర్