నితిన్ కు జోడీగా నభా నటేష్ ?

Tollywood Young Actor Nithiin To Pair Up Ismart Shankar Actress Nabha Natesh

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ “భీష్మ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్ ప్రస్తుతం “రంగ్ దే “, చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే “పవర్ పేట ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ రైట్స్ నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ , ఠాగూర్ మధు స్వంతం చేసుకున్నారు. సక్సెస్ ఫుల్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “, “ఎక్స్ ప్రెస్ రాజా” మూవీస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందే ఈ రీమేక్ మూవీ లో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను అనుకున్నారు. ఇప్పడు ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ ను సంప్రదించారు. క్యారెక్టర్ నచ్చి నభా నటేష్ కూడా ఈ మూవీ లో నటించడానికి ఆసక్తితో ఉన్నారని సమాచారం. నభా నటేష్ ప్రస్తుతం “సోలో బ్రతుకే సో బెటర్ “, అల్లుడు అదుర్స్” మూవీస్ లో నటిస్తున్నారు. “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ షూటింగ్ మొత్తం పాండిచ్చేరి లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =