మళ్లీ పెళ్లి చేసుకోనంటున్న అల్లు అర్హ

Stylish Star Allu Arjun Daughter Allu Arha Says No When Asked To Marry The Boy Of His Father Choice
Stylish Star Allu Arjun Daughter Allu Arha Says No When Asked To Marry The Boy Of His Father Choice

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక తాజాగా ఇప్పుడు అర్హ కు సంబందించిన మరో వీడియోను రిలీజ్ చేశారు. గతంలో అల్లు అర్జున్ ఒక వీడియో లో నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పమంటే, చేసుకోను అంటూ టక్కున అర్హ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు మళ్లీ అదే ప్రశ్న అర్హ ను అడగగా దానికి అర్హ నేను మళ్లీ చేసుకోను పరిగెడుతుంది. ఇక ఈ వీడియో కూడా చూడటానికి క్యూట్ గా ఉండి.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆ వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Attempt number #374 #nanatrails 💖

A post shared by Allu Arjun (@alluarjunonline) on

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘పుష్ప‌’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =