రవితేజ కోసం బాలీవుడ్ హీరోయిన్..!

Bollywood Heroine For Ravi Teja’s Next?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja New Movie News,Ravi Teja Next project News,Ravi Teja Latest Film Updates,Ravi Teja Upcoming Project News On Cards

రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో ప్ర‌ముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మూవీ కి “ఖిలాడి ” టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. ఇక లాక్‌డౌన్ ముగిసి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న వెంట‌నే గ్రాండ్‌గా సినిమాని లాంచ్ చేస్తామ‌ని… ఏ మధ్యలో ఎలాంటి రూమర్స్ వచ్చినా వాటిని నమ్మొద్దని ఆయ‌న గతంలోనే అన్న సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఎంత చెప్పిన రూమర్లు ఆపడం కష్టమే కదా.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఒక రూమర్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ఇదినిజమేనా? ఆ హీరోయిన్ ఎవరో తెలియాలి అంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నాడు. సూపర్ హిట్ “డాన్ శీను “, బలుపు ” మూవీస్ తరువాత గోపీచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ లో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.