సినిమా హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది

Tollywood Actor Nandamuri Balakrishna Exudes His Confidence On His New Movie With Director Boyapati Srinu
Tollywood Actor Nandamuri Balakrishna Exudes His Confidence On His New Movie With Director Boyapati Srinu

బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటినుండో ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా..బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సినిమా టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ పై బాలకృష్ణ కూడా స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరంలేదు. మా కాంబినేషనల్‌ ఇది మూడో సినిమా.. ఎక్కడా టెన్షన్‌ తీసుకోవడం లేదు…సినిమా హిట్‌ కాకుండా ఎక్కడికి పోతుంది ఈ సినిమా అన్నారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ మూడో సినిమా చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twenty =