ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్నఈ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో రానా బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా అంతా ఆయన బాగా పెరిగిన గడ్డం, గ్రే హెయిర్, పైకి వంచిన భుజంతో కనిపిస్తారు. ఇక ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గినట్టు కూడా గతంలో తెలిపారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడిన ఆయన .. షూటింగ్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలిపారు.
అడవులలో ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటి వరకు చేసిన సినిమాల కన్నా ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. నా భుజాలపై ఏనుగు తొండాన్ని మోయాల్సి వచ్చేది. ఆ తొండం బరువు సుమారుగా 160-170 కేజీల వరకు ఉండేది. బాహుబలిలో చేయడం కన్నా అరణ్యలో నటించడం చాలా కష్టంగా అనిపించిందని రానా చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: