కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 105

సినిమా వార్తలు

మళ్లీ బాక్సింగ్ మోడ్ లోకి వరుణ్..!

ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు... హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'జాతిరత్నాలు' డబ్బింగ్ చెబుతున్నా..!

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ తెలిసిందే కదా లాక్ డౌన్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోవడంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

భారీ కుటుంబ కథా చిత్రంతో కలెక్షన్ కింగ్..!

ఒకప్పుడు హీరో హీరోయిన్స్ గా వెండితెరపై ఎన్నో సూపర్ హిట్స్ కొట్టి ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడుకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే సూర్య సినిమా సూరారై పొట్రు తెలుగులో ఆకాశమే నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో పాటు మణిరత్నం మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తెలుగులో మహానటి సినిమాలో తప్ప ఇంతవరకూ మరే సినిమాలో కనిపించలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాజమౌళి ట్రయిల్ షూట్ విశేషాలు..!

రాజమౌళి ట్రయిల్ షూట్ చేస్తున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఓకే.. ఎలాంటి సమస్యా లేకుండా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అందరు. ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేసుకోవచ్చనేది ఇండస్ట్రీ పెద్దల ఆలోచన.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కు మహేష్ బర్త్ డే విషెస్..!

వరుస హిట్లతో తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. కెరీర్ మొదటి నుండి స్టార్ హీరో లతోనే చేసాడు. మొదటి సినిమా మిర్చి ప్రభాస్ తో, శ్రీమంతుడు, భరత్ అనే నేను మహేష్ తో, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ తో సినిమాలు తీసి వరుస హిట్స్ కొట్టాడు. అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘన విజ‌యాల‌ను సాధించివ‌వే. ఇప్పుడు ఏకంగా చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల చిరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా కు బ్రేక్ తీసుకున్న త్రిష

రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష ప్రస్తుతం 4 తమిళ , ఒక మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు లాక్ డౌన్ సమయం లో త్రిష సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొంత కాలం సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని త్రిష నిర్ణయం తీసుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పాత జ్ఞాపకాలు - 'పెదరాయుడు' సినిమా ఆసక్తికర విషయాలు..!

రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'పెదరాయుడు' ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోహన్ బాబు సినీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. 15 జూన్ 1995న విడుదలైన ఈ సినిమా ఈ రోజుతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ సినిమా తమిళ్ 'నటామై' సూపర్ హిట్ సినిమాకు రీమేక్. తమిళనాట కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో, శరత్ కుమార్, విజయ్ కుమార్, ఖుష్బూ, మీనా తదితరులు ప్రధాన పాత్రలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రష్మిక షార్ట్ స్టోరీ

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తన జీవిత విశేషాలను రష్మిక అభిమానులతో పంచుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో నటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఫోటో షూట్ లో బ్లూ శారీ తో పాల్గొన్న రష్మిక ఆ ఫొటోలతో పాటు ఒక చిన్న కథ ను రాసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుష్క ?

సక్సెస్ ఫుల్ "సూపర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అరుంధతి , సరోజ , రుద్రమదేవి , దేవసేన, భాగమతి క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " విడుదలకు సిద్ధంగా ఉంది . "అరుంధతి ", "వేదం" ,"ఢమరుకం ", "రుద్రమదేవి "," బాహుబలి 2", "భాగమతి " మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

ప్రాణం కన్నా విలువైనది ప్రపంచంలో మరొకటి లేదు. అటువంటి ప్రాణాన్ని రక్త దానం చేసి రక్షించడం గొప్ప సంతృప్తి ని కలిగించే విషయమని తెలిసిందే . జూన్ 14 ప్రపంచరక్త దాన దినోత్సవ సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ గా ట్వీట్ చేస్తూ ,ఒక వీడియో ను షేర్ చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
KGF 2 Hero Yash Quashes Rumours About Releasing Movie On OTT Platforms
ఓటీటీ

KGF2 రిలీజ్ పై క్లారిటీ - ఆడియన్స్ కు ఏం కావాలో తెలుసు..!

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ప్ర‌ఖ్యాత హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వ‌సూలు చేసింది. ఇక అదే జోష్ తో `కె.జి.ఎఫ్‌- చాప్ట‌ర్ 2' కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సమంత క్వారంటైన్ హాబీ

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2 "వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆగష్ట్ లో సెట్స్ పైకి రానా-రవితేజ సినిమా..!

మలయాళం సూపర్ హిట్ మూవీ "అయ్యప్పనుమ్ కోషియమ్ " సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎప్పుడో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘స్వామిరారా’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారని టాక్. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కథ లో కొన్ని మార్పులు చేయనున్నారట.

TFN Adminవాట్సాప్
Prabhas 20 Movie Team To Erect A Massive Georgia City Set At Ramoji Film City For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

#Prabhas 20 మూవీ కి భారీ సెట్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ "#Prabhas 20" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న ఈ మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు, బాలకృష్ణ తో సినిమా తీయాలని కోరిక..!

ఇండస్ట్రీ లో ఎంతో సీనియర్ డైరెక్టర్స్ దగ్గర నుండి కొత్తగా వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వరకూ ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ డైరెక్టర్స్ లో ఎవరి స్టయిల్ వారిది. బేసిగ్గా డైరెక్టర్స్ అందరికి అందరు హీరోలతో సినిమాలు చేసేయాలని అనిపిస్తుంది. అయితే అది కొంత మంది డైరెక్టర్స్ కు అది వర్క్ అవుట్ అయినా కొంతమందికి మాత్రం కాదు. ఒకప్పుడు అంటే కుదిరేదేమో కానీ ఇప్పుడున్న పరిస్థితులు.. ఇప్పుడున్న పోటీ వాతావరణం.. కొత్త కొత్త డైరెక్టర్స్ రావడం ఇలాంటి పరిస్థితుల్లో కష్టమైన విషయమే. కానీ కొంతమంది డైరెక్టర్స్ కు మాత్రం కొంతమంది హీరోలతో మాత్రం సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ అయితే తమ అభిమాన హీరోను డైరెక్ట్…

TFN Adminవాట్సాప్
I Just Finished Script Work For My Movie Kshatriya Putrudu In Just 7 Days Says Veteran Actor Kamal Haasan
సినిమా వార్తలు

5 నేషనల్ అవార్డ్స్ సినిమా 'క్షత్రియ పుత్రుడు' 7 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశా..!

లాక్ డౌన్ వల్ల ఇంటికే పరితిమితమైన సెలెబ్రిటీస్ సోషల్ మీడియా కు మాత్రం బాగానే దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి సోషల్ మీడియా లైవ్‌ఛాట్‌లో పాల్గొన్నారు. ఇక ఛాట్ లో కమల్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అందులో తన కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన క్షత్రియ పుత్రుడు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. అదేంటంటే.. సినిమా కథను కేవలం ఏడు రోజుల్లోనే రాశాడట కమల్ హాసన్. `దేవర్ మగన్` దర్శకుడు, నా స్నేహితుడు భరతన్ ‌నాతో సవాల్ చేశాడు. స్క్రిప్టును త్వరగా పూర్తి చేయకపోతే సినిమా నుంచి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రైతులకు అమల సాయం..!

కరోనా వల్ల గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నాయి. ఇక సినీ ప్ర‌ముఖులు కూడా త‌మ వంతు సాయం అందించారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి సినీ తారలు కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. సామాన్య ప్రజల కూడా ఎంతో మంది ముందుకు వచ్చి పేదలకు సాయం చేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తా..!

మలయాళం ప్రేమమ్ ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమై, సౌత్ ఇండియన్ యువకులకు మలర్ గా మారిపోయింది సాయి పల్లవి. ఫిదా సినిమా చూశాక యువత మొత్తం ఆమె అభినయానికి, అందానికి, డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. కేవలం పాత్ర ప్రధానమైన సినిమాలే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనకు 'సమంత'.. వాళ్లకు 'యశోద'

సౌత్ ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కూడా లేకపోవడం ఇంట్లోనే చైతుతో కలిసి టైంను స్పెండ్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాల చందర్ గురించి కమల్ - కారు కొనిస్తా అని ఎన్నో ఏళ్లు బతిమిలాడుకున్న..!

ఎంత ఎదిగినా కొంతమంది మాత్రం సింపుల్ గా జీవించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకు తెలిసిన ఎంతో మంది సెలబ్రిటీస్ ఇప్పటికీ అలాంటి లైఫ్ నే కోరుకుంటారు. ఇక తన గాడ్ ఫాదర్, గురువు బాలచందర్ కూడా అంతే అంటున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్. తాజాగా ఏ.ఆర్ రెహ్మాన్ తో ముచ్చటించిన ఆయన తన గురువు గారి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఆఖరి క్షణం వరకూ తాను చాలా సింపుల్ గానే జీవించారని.. అంతేకాదు తనకు ఒక కారు కొనిస్తానని ఎన్నో ఏళ్ళు బతిమాలానని.. కానీ ఎప్పుడూ ఒప్పుకోలేదని అన్నారు. తాను మాత్రం ఒక ఆటో కొనుక్కొని ఎక్కడికి వెళ్లాలన్నా అందులోనే వెళ్లేవారని.. అంత సింపుల్ గా ఉండేవారని తనని కోల్పోవడాన్ని…

TFN Adminవాట్సాప్

షేర్