సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్ మెంట్

Saaho Director Sujeeth Reddy Gets Engaged To Doctor Pravallika In Hyderabad
Saaho Director Sujeeth Reddy Gets Engaged To Doctor Pravallika In Hyderabad

మొత్తానికి టాలీవుడ్ లో ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి ఎక్కువైంది. అదేం విచిత్రమో కానీ ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఒక పక్క కరోనా ఉన్నా కూడా లెక్కచేయకుండా పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ పెళ్లి జరిగిపోయింది. రానా పెళ్ళికి సిద్ధంగా ఉన్నాడు. నితిన్ కూడా లైన్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు అలా పెళ్లి వార్తలు వచ్చాయో లేదో ఇలా నిశ్చితార్థం చేసేసుకున్నాడు సాహో డైరెక్టర్ సుజీత్. ప్రవల్లిక అనే డెంటిస్ట్‌తో సుజీత్ గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్‌లో సుజీత్‌-ప్రవళికల నిశ్చితార్థం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఎంగేజ్ మెంట్ చాలా సింపుల్‌గానే జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయిన్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రన్ ‌రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతోనే మెగాస్టార్‌ తన లూసిఫర్ భాద్యతలు సుజీత్ కు అప్పంగించారు. ప్రస్తుతం సుజీత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.