నా కూతురిని షూటింగ్స్ కు పంపించేది లేదు అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. గత మూడు నెలల నుండి ఇంట్లోనే ఉంటుండగా..ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కు మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం అవుట్ డోర్ లు ప్లాన్ లు చేయకుండా ఇన్ డోర్ షూటింగ్ లు మొదలుపెట్టి.. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత విదేశాల్లో ప్లాన్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్స్ కి హాజరుకాను అంటున్నారు. అంతేకాదు తన కూతురు శ్రద్దా కపూర్ ని కూడా షూటింగ్స్ పంపనని చెప్పేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాలకంటే పని ముఖ్యం ఏది కాదు. ఇప్పుడే షూటింగ్స్ ప్రారంభిస్తే పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారతాయి. ఇంకొంత సమయం వేచిచూడడం మంచిదన్నారు. మరి శ్రద్ధ షూటింగ్స్ లో పాల్గొనాలంటే డైరెక్టర్స్ ముందు శక్తి కపూర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే అన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా బాలీవుడ్ దూసుకుపోతున్న శ్రద్ద సాహోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్‌తో భాగీ 3 అనే చిత్రంలో నటించింది. లాక్‌డౌన్ ముందు రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. లాక్‌డౌన్ వల్ల థియేటర్స్ మూతపడటంతో ఈ సినిమా థియేటర్ల నుంచి తొలగించడం జరిగింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: