విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు

Bollywood Actress Ananya Pandey Heaps Praises On Tollywood Crazy Actor Vijay Deverakonda

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన “పెళ్ళిచూపులు ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విజయ్ పై ప్రేక్షక , అభిమానులలో క్రేజ్ పెరిగింది. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ తో విజయ్ స్టార్ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు కురిపించారు. అనన్య మాట్లాడుతూ .. స్క్రీన్ పై పవర్ ఫుల్ గా కనిపించే విజయ్ రియల్ లైఫ్ లో విరుద్ధంగా ఉంటారని , మృదు స్వభావం తో ఉంటారని, లాక్ డౌన్ సమయం లో మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించిన విజయ్ దయార్ద్ర హృదయుడని , ఎంత ఎదిగినా గర్వం లేకుండా ఒదిగి ఉంటారని , ఆయనతో కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =