ఈ లాక్ డౌన్ వల్ల కొంతమందికి తమ కుటుంబాలతో గడిపే సమయం దొరికితే.. కొంతమంది మాత్రం అదే కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క పక్క రాష్ట్రాల వారే అటు ఇటు వెళ్ళడానికి లేకుండా పోయింది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎంతోమంది మధ్యలో ఇరుక్కుపోయారు. ఇక్కడికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆగిపోయారు. మంచు విష్ణు భార్య విరనికా కూడా దాదాపు 3 నెలల నుండి సింగపూర్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉండగా.. `వందేభారత్ మిషన్`లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు వంద రోజుల అనంతరం పిల్లలతో కలిసి విరనికా ఇంటికి రాబోతున్నారు. ఇక ఇదే విషయాన్ని తాను తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమానంలో పిల్లలతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఎట్టకేలకు 100 రోజుల తర్వాత ఇంటికొస్తున్నామని కామెంట్ చేశారు. ఇందుకు కారణమైన విమానయాన సంస్థలకు, ప్రభుత్వాలకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫొటోలో విరానికా, పిల్లలు ముఖానికి మాస్కులు, ఫేష్ షీల్డ్, చేతులకు గ్లౌజులు ధరించి ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Finally going home after 100 days in Singapore. #vandebharatmission
Thank you @indiainsingapor & @airindiain for the exemplary effort in taking us home. AI Singapore team was extremely wonderful & helpful!High commissioner @jawedashraf5 and your entire team, thank you so much! pic.twitter.com/aLkr1VtZ3J
— Viranica Manchu (@vinimanchu) June 11, 2020
కాగా లాక్డౌన్ ముందు బంధువులను కలవాడిని విదేశాలకు వెళ్లిన మంచు విష్ణు ఫ్యామిలీ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొద్దిరోజుల క్రితం మంచు మనోజ్ పిల్లల్ని బాగా మిస్సవుతున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక విరానికా,పిల్లలు తిరిగి వస్తున్నారని తెలియడంతో మంచు విష్ణు సంతోషంలో ఉన్నాడు.




ఇదిలా ఉండగా విష్ణు మంచు ప్రస్తుతం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెలుగు , ఇంగ్లీష్ భాషలలో ఐటి స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న “మోసగాళ్ళు ” మూవీ లో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. దీనితో పాటు మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను కూడా లైన్ లో పెట్టాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























