
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 99


చిరు-కొరటాల మూవీ రూమర్లు నమ్మొద్దు

మహర్షి చివరి షెడ్యూల్ అప్ డేట్

ప్రేమకథా చిత్రమ్ 2 కి విలక్షణ నటుడి వాయిస్ ఓవర్

భారతీయుడు2 లో అభిషేక్ బచ్చన్ ?

బ్రహ్మీ ఆరోగ్యం పై కొడుకు గౌతమ్ స్పందన

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్

బోని కపూర్ నోటీసులపై స్పందించిన ప్రియా ప్రకాష్

జయలలిత గురించి నిత్యా - రాజకీయాలు పెద్దగా తెలీదు

15 మంది కొత్త కళాకారులతో `సీత`

`ఆర్ ఆర్ ఆర్`లో తారక్, చరణ్ పాత్రలవేనా?

సంక్రాంతి విజేత F 2 మూవీ

ఈ ఏడాది నాలుగు ప్రాజెక్టులతో సుకుమార్ బిజీ బిజీ

సెన్సార్ పూర్తి చేసుకున్న Mr. మజ్ను
తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా Mr. మజ్ను. ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎస్వీసీసీ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్) అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

చిరు-కొరటాల మూవీ రూమర్లు నమ్మొద్దు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ శివ కొరటాల దర్శకత్వంలో చేయనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆతరువాత త్రివిక్రమ్ పేరు తెరపైకి రావడంతో కొరటాల శివతో సినిమా ఉండటంలేదని, అది ఇంకా ఆలస్యం కానుందని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ రూమర్లపై ఓ క్లారిటీ వచ్చింది.

మహర్షి చివరి షెడ్యూల్ అప్ డేట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా పొల్లాచ్చిలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుండగా... ఈ వారం చివరితో అక్కడి షెడ్యూల్ పూర్తువుతుంది. దాని తరువాత ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు చిత్రబృందం.

ప్రేమకథా చిత్రమ్ 2 కి విలక్షణ నటుడి వాయిస్ ఓవర్
మారుతి డైరెక్షన్ లో కామెడీ హార్రర్ జోనర్ లో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేమ కథా చిత్రమ్ 2 కూడా తెరకెక్కుతుంది. ఆర్.పి.ఏ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

భారతీయుడు2 లో అభిషేక్ బచ్చన్ ?
23 ఏళ్ల క్రితం వెండితెరపై సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై.. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఈనెల 18 నుండి ప్రారంభించారు. ఇక ప్రారంభంముందు నుండే భారతీయుడ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దానికి తోడు భారతీయుడు గెటప్ లో కమల్‌హాసన్ ఫస్ట్ లుక్ కు అందరూ ఫిదా అవ్వడంతో.. ఈ సీక్వెల్ కూడా భారతీయుడు సినిమాలాగ మంచి విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు.

కొనసాగుతున్న ఎఫ్ 2 కలెక్షన్ల జోరు
ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో విజేత ఎవరంటే ఎఫ్ 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం.. ఎఫ్2 సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమాకే బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి ఈ ఐదు రోజుల్లో ఎఫ్ 2 సాధించిన కలెక్షన్లు ఏంటో ఒకసారి చూద్దాం.

Mr. మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
తొలిప్రేమ సినిమా విజయం తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా Mr. మజ్ను. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.

బ్రహ్మీ ఆరోగ్యం పై కొడుకు గౌతమ్ స్పందన
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందానికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో బ్రహ్మనందం ఆపరేషన్ జరిగింది. ప్రముఖ డాక్టర్ రమాకాంత్ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్
సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్రోలింగ్ కూడా మామూలైపోయింది. రోజుకో సెలబ్రిటీ కామెంట్లకు బలైపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ..కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ వల్గర్ కామెంట్ పెట్టాడు. ఇక ఇది తెలిసిన రకుల్ ఆ కామెంట్ పై స్పందిస్తూ..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

భారతదేశపు తొలి సినీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్ వీ ప్రసాద్
ఆర్థిక బాధలతోఅప్పుల పాలైన తండ్రి, కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేని ఆర్థిక పరిస్థితి , ఎటు చూసినా నిరాశ, నిస్పృహ - ఇలాంటి స్థితిలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి ఒక సంస్థగా, వ్యవస్థగా ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా?

బోని కపూర్ నోటీసులపై స్పందించిన ప్రియా ప్రకాష్
'ఒరు అదార్ లవ్'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అదార్ లవ్' ఇంకా రిలీజ్ కాలేదు కానీ... తాను మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీదేవి బంగ్లా అనే సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.

జయలలిత గురించి నిత్యా - రాజకీయాలు పెద్దగా తెలీదు
నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని, 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ను జయలలిత బయోపిక్ లో మీరు నటిస్తున్నారు కదా.. ఈ సినిమా ఆఫర్ అసలు మీకు రాకముందు ఆమె గురించి మీ ఒపీనియన్ ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. దానికి నిత్యామీనన్ తన దైన శైలిలో సమాధానం చెప్పింది.

`భారతీయడు` సీక్వెల్ లో విలన్‌గా అక్షయ్ కుమార్?
లోక నాయకుడు కమల్ హాసన్, ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన `భారతీయుడు` (1996) చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మళ్ళీ 23 ఏళ్ళ తరువాత వీరిద్దరి కలయికలో ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఈ సీక్వెల్ ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని పవర్ఫుల్ విలన్ రోల్‌కు బాలీవుడ్…

15 మంది కొత్త కళాకారులతో `సీత`
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా ప్రముఖ దర్శకుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `సీత` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... ఇప్పటికే సింహభాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి నెలాఖరులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి... ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... తన సినిమాల ద్వారా కొత్తవారిని పరిచయం చేసే తేజ... ఈ చిత్రంతో దాదాపు 15 మంది కొత్త కళాకారులను తెలుగు పరిశ్రమకు అందిస్తున్నారని సమాచారం…

వెంకీకి మరోసారి కలిసొచ్చిన సంక్రాంతి `ఫస్ట్ టైమ్` సెంటిమెంట్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌కి, సంక్రాంతికి విడదీయరాని అనుబంధముంది. ఈ సీజన్లో... ఆయన నటించిన 16 చిత్రాలు (తాజా చిత్రం `ఎఫ్ 2`తో కలుపుకుని) విడుదల కాగా.. వాటిలో 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసాయి. ఆ చిత్రాలే `శత్రువు`, `చంటి`, `కలిసుందాం...రా!`, `లక్ష్మీ`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`. అయితే... ఈ ఆరు చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ ఆరు సినిమాల్లో నటించిన హీరోయిన్లంతా వెంకీతో కలసి తొలిసారిగా వెండితెరపై సందడి చేసిన వారే కావడం విశేషం.

`ఆర్ ఆర్ ఆర్`లో తారక్, చరణ్ పాత్రలవేనా?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`(వర్కింగ్ టైటిల్). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా... ఈ నెల 21 నుంచి తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుంది. ఇదిలా ఉంటే... రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే... 1940, 2018 కాలాల్లో జరిగే ఈ కథలో... 40ల నాటి కాలంలో ధనవంతుడైన యువకుడి పాత్రలో రామ్ చరణ్…

సంక్రాంతి విజేత F 2 మూవీ
సంక్రాంతి పండుగ సందర్భంగా 4సినిమాలు రిలీజయ్యాయి. క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథా నాయకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన పేట (తెలుగు డబ్బింగ్ వెర్షన్), బోయపాటి శ్రీను దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన F 2 ఫన్ &ఫ్రస్టేషన్ సంక్రాంతి బరిలో దిగాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన F 2 మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది.

చిరంజీవి ‘ముఠామేస్త్రి’కి 26 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ముఠామేస్త్రి’ ఒకటి. అంతేకాదు.. వీరి కలయికలో వచ్చిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. కూరగాయల మార్కెట్లో ఉండే ఓ మేస్త్రి... పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. చిరంజీవికి జోడీగా మీనా, రోజా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, గుమ్మడి, మన్సూర్ అలీ ఖాన్, శరత్ సక్సేనా, కోట శ్రీనివాసరావు, జె.వి.సోమయాజులు, యువరాణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని కామాక్షి దేవీ కమల్ కంబైన్స్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా…

కల్యాణి ప్రియదర్శన్ కొత్త సినిమా అప్ డేట్
‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది కల్యాణి ప్రియదర్శి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారంటూ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ ఏడాది నాలుగు ప్రాజెక్టులతో సుకుమార్ బిజీ బిజీ
గత ఏడాది రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటి వరకూ ఏ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరోపక్క రంగస్థలం సక్సెస్ తో సుకుమార్ తరువాత సినిమాపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్ల.. తరువాత సినిమాపై ఇప్పటినుండే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సుకుమార్ కూడా అందుకే భయపడ్డాడేమో కానీ..ఇప్పటి వరకూ ఏ కథకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఈ ఏడాది మాత్రం సుకుమార్ పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడపబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్టులతో ఈ ఏడాది మొత్తం బిజీ అవుతున్నాడు.