నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్

Rakul Preet Strong Counter To Comments On Her Dressing Style,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie Updates,Actress Rakul Preet About Her Dressing Style,Heroine Rakul Preet Singh Strong Counter To Comments OnHer Dressing Style
Rakul Preet Strong Counter To Comments On Her Dressing Style

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్రోలింగ్ కూడా మామూలైపోయింది. రోజుకో సెలబ్రిటీ కామెంట్లకు బలైపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ..కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ వల్గర్ కామెంట్ పెట్టాడు. ఇక ఇది తెలిసిన రకుల్ ఆ కామెంట్ పై స్పందిస్తూ..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్లు చాలానే చేసిందేమో… అందుకే నీకు తెలిసింది. ఈ సెషన్ల వివరాల గురించి ఆమెనే అడుగు. అప్పటివరకూ మహిళలకు రక్షణ ఉండదేమో. కేవలం సమానత్వం, రక్షణ అని చర్చలు సాగిస్తే ఉపయోగం ఉండదు” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఇక ఈ రిప్లై మీద కూడా నెటిజన్లు స్పందిస్తూ రకుల్ పై మండిపడుతున్నారు. కొందరు రకుల్ రిప్లైను సమర్థిస్తుండగా…కొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?” అని అంటుండగా.. దానికి కూడా రకుల్ సమాధానం ఇచ్చింది. “నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇలాంటి వారికి బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను… వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి కచ్చితంగా ఒకటిస్తుందనే అనుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది. మరి ఈ ట్విట్టర్ వార్ ఇక్కడితో ఆగుతుందా? లేక ఇంకా కంటిన్యూ అవుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో.

 

[subscribe]

[youtube_video videoid=ISSJx9e4em0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + seventeen =