లోక నాయకుడు కమల్ హాసన్, ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన `భారతీయుడు` (1996) చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మళ్ళీ 23 ఏళ్ళ తరువాత వీరిద్దరి కలయికలో ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన ఈ సీక్వెల్ ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని పవర్‌ఫుల్ విలన్ రోల్‌కు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను ఎంచుకున్నారట. తొలుత ఈ పాత్రకు మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌ను అనుకున్నప్పటికీ… కాల్షీట్ల సమస్య కారణంగా ఆ స్థానంలోకి అక్షయ్ వచ్చాడని సమాచారం. ఇదివరకు శంకర్, అక్షయ్ కాంబోలో `2.0` వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమాలో కమల్‌కి మనవడి పాత్రలో యువ కథానాయకుడు సిద్ధార్థ్ నటించనున్నాడని సమాచారం. త్వరలోనే సిద్ధార్థ్, అక్షయ్ కుమార్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: