యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`(వర్కింగ్ టైటిల్). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా… ఈ నెల 21 నుంచి తదుపరి షెడ్యూల్‌ను జరుపుకోనుంది. ఇదిలా ఉంటే… రెండు డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో జరిగే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… 1940, 2018 కాలాల్లో జరిగే ఈ కథలో… 40ల నాటి కాలంలో ధనవంతుడైన యువకుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించనుండగా… పేదవాడి పాత్రలో తారక్ కనిపించనున్నాడట. ఇక 2018 నాటి కాలంలో జరిగే కథలో తారక్ గొప్పింటి కుర్రాడిగానూ… చరణ్ పేదింటి అబ్బాయిగానూ దర్శనమివ్వనున్నాడట. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా… 2020 వేసవిలో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: