ప్రేమకథా చిత్రమ్ 2 కి విలక్షణ నటుడి వాయిస్ ఓవర్

Latest Telugu Movies News, Prema Katha Chitram 2 Movie Latest News, Prema Katha Chitram 2 Movie Latest Updates, Rao Ramesh To Give Voice Over For Prema Katha Chitram 2 Movie, Rao Ramesh to Lend Voice for Prema Katha Chitram 2, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Rao Ramesh to Lend Voice for Prema Katha Chitram 2

మారుతి డైరెక్షన్ లో కామెడీ హార్రర్ జోనర్ లో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమ్ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ప్రేమ కథా చిత్రమ్ 2 కూడా తెరకెక్కుతుంది. ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ది ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాకు ఓ విలక్షణ నటుడితో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. ఆయనెవరో కాదు రావు రమేష్. ఏ కార్యక్టర్ అయినా తన నటనతో ఇట్టే కట్టిపడేస్తారు రావు రమేష్. ఆయన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారట. మరి తన నటన, డైలాగ్స్ తో అందరినీ అలరించే రావు రమేష్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించడం ప్లస్ పాయింటే.

కాగా హ‌రి కిషన్ ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ సినిమాలో విధ్యులేఖ‌, ప్ర‌భాస్ శ్రీను, కృష్ణ తేజ‌, ఎన్‌.టి.వి.సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. జె.బి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను… ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి టీజర్ తో అందరి ప్రశంసలు అందుకున్న ఈసినిమా ప్రేమకథా చిత్రమ్ లా అందరినీ అలరిస్తుందో?లేదో? చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=mOxNu7opiV4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.