తొలిప్రేమ సినిమా విజయం తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా Mr. మజ్ను. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా ఎవరొస్తున్నారనుకుంటున్నరా? ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని ఎస్వీసీసీ (శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్) అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
Glad to announce that Young Tiger @tarak9999 will be gracing the Pre Release Event of #MrMajnu on 19th Jan#MrMajnuPreRelease @AkhilAkkineni8 @AgerwalNidhhi @dirvenky_atluri @MusicThaman @ShreeLyricist @George_DOP @SVCCOfficial @SonyMusicSouth #MrMajnuOnJan25th pic.twitter.com/p7jCAp9s06
— SVCC (@SVCCofficial) January 17, 2019
కాగా యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న… ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. కెమెరా: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, పాటలు: శ్రీమణి.
[youtube_video videoid=9CY19BnsPoM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: