బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా ప్రముఖ దర్శకుడు తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `సీత` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే… ఇప్పటికే సింహభాగం చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి నెలాఖరులో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ సుంకర, కిషోర్ గరికపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి… ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… తన సినిమాల ద్వారా కొత్తవారిని పరిచయం చేసే తేజ… ఈ చిత్రంతో దాదాపు 15 మంది కొత్త కళాకారులను తెలుగు పరిశ్రమకు అందిస్తున్నారని సమాచారం. కాగా… ఈ సినిమాలో మన్నారా చోప్రా, సోనూ సూద్, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. `లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` తరువాత తేజ – కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: