
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 93


ఆరేళ్ళ తరువాత... రీమేక్‌లో రామ్?

న్యూ ఢిల్లీ లో కొత్త సినిమా ప్రారంభం

రిలీజయిన చిత్రలహరి మూవీ టీజర్

ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్!

సందిగ్దంలో పడేసిన పరిణితి!

శ్వాస మూవీలో నిఖిల్ రోల్ రివీల్!

నాగశౌర్య కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!

భారతీయుడు 2 - ఎలక్షన్స్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్

ముంబై నేపథ్యంలో రజనీ కొత్త చిత్రం?

హారర్ కామెడీ సినిమాలో జాన్వీ కపూర్

దేవిశ్రీ ప్రసాద్ తొలి చిత్రం `దేవి`కి 20 ఏళ్ళు

కళ్యాణి ప్రియదర్శన్... డబుల్ ధమాకా

రిలీజ్ కానున్న చిత్రలహరి మూవీ టీజర్

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో

మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మహర్షి

ఆకాష్ హీరోయిన్ గా ఢిల్లీ భామ!

టర్కిష్ సినిమా రీమేక్ లో!

వెంకీ, రానా కాంబినేషన్‌లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్?
మల్టీస్టారర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ, `గోపాల గోపాల`లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తోనూ కలసి సందడి చేశాడు వెంకీ. అలాగే యువ కథానాయకులు రామ్ (మసాలా), వరుణ్ తేజ్ (ఎఫ్ 2)తోనూ కలసి నటించి అలరించాడు. వీటిలో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `ఎఫ్ 2`... ఘనవిజయం సాధించాయి. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో `వెంకీ మామ` చేస్తున్నాడు వెంకీ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ దసరాకి సరదాలు పంచనుంది.

ఆరేళ్ళ తరువాత... రీమేక్‌లో రామ్?
కథానాయకుడిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ది 13 ఏళ్ళ నటప్రస్థానం. ఇప్పటివరకు 16 సినిమాలతో వెండితెరపై సందడి చేశాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 17వ చిత్రంగా `ఇస్మార్ట్ శంకర్` చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న్యూ ఢిల్లీ లో కొత్త సినిమా ప్రారంభం
సెన్సేషనల్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి తో విజయ్ దేవరకొండ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. గీత గోవిందం, టాక్సీ వాలా కమర్షియల్ సక్సెస్ మూవీస్ తో స్టార్ స్టేటస్ పొందారు. నోటా మూవీ తో విజయ్ దేవరకొండ కోలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ ని విజయ్ ఓకే చేశారు.

రిలీజయిన చిత్రలహరి మూవీ టీజర్
మైత్రీ మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న చిత్రలహరి మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా ముఖ్య పాత్రలలో సునీల్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణ మురళి నటించారు.

ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రెస్ మీట్!
బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన రాజమౌళి.. ఇప్పుడు కోల్ కతా లో 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.

సందిగ్దంలో పడేసిన పరిణితి!
రాజమౌళి దర్శకత్వంలో సినిమా...అందులోనూ ఇద్దరు స్టార్ హీరోలు.. భారీ బడ్జెట్ మూవీ.. ఇవి చాలు కదా సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా పరిస్థితి కూడా అదే. ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చాలు క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక హీరోయిన్స్‌కి సంబంధించి కూడా ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లు.. పరిణితి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపించాయి. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ యాక్ట్రెస్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటన్నింటికీ క్లారిటీ ఇవ్వాలంటే అది రాజమౌళినే ఇవ్వాలి.

శ్వాస మూవీలో నిఖిల్ రోల్ రివీల్!
ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. కిర్రాక్ పార్టీ ఎఫెక్ట్ తో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఆ నేపథ్యంలోనే అర్జున్ సురవరం అనే ఆసక్తికరమైన స్టోరీతో ముందుకు వస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ వేసవిలో సందడి చేయనున్న హారర్ కామెడీ సీక్వెల్స్
వేసవి వినోదాలకు రంగం సిద్ధమవుతోంది. ఓ వైపు అగ్ర కథానాయకుల చిత్రాలు... మరో వైపు యువ కథానాయకుల సినిమాలు ప్రేక్షకులను వినోదాల జల్లులో ముంచేందుకు ముస్తాబవుతున్నాయి. వీటితో పాటు భయపెడుతూనే నవ్వించడానికి హారర్ కామెడీ ఫిల్మ్స్ సందడి చేయబోతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే... కేవలం నెల రోజుల గ్యాప్‌లో తెలుగు తెరపై మూడు హారర్ కామెడీ ఫిల్మ్స్ కు సంబంధించిన సీక్వెల్స్ తెరపైకి రాబోతున్నాయి.

నాగశౌర్య కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!
శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈవిషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.

ఆ పాత మధురాలను గుర్తు చేసిన లవ్లీ మెలోడీ "ప్రియతమా"...
ఓవర్ ఆర్కెస్ట్రా తాలూకు రణగొణ ధ్వనుల మధ్య సంగీతం దారి సంగీతంది.. సాహిత్యం దారి సాహిత్యందిగా మారిపోయిన నేపథ్యంలో శ్రవణ శ్రావ్యమైన ఒక పాటను విని ఎంత కాలమైందో..?

భారతీయుడు 2 - ఎలక్షన్స్ తరువాత నెక్ట్స్ షెడ్యూల్
స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చెన్నైలో రెండు కీలకమైన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

ముంబై నేపథ్యంలో రజనీ కొత్త చిత్రం?
సూపర్ స్టార్ రజనీ కాంత్... వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ పెంచుతున్నాడు. తాజాగా కేవలం ఎనిమిది నెలల గ్యాప్‌లోనే `కాలా`, `2.0`, `పేట` చిత్రాలతో పలకరించి... ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఇదే ఊపులో... తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడీ సూపర్ స్టార్. బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రజనీ డబుల్ రోల్‌లో సందడి చేయబోతున్నాడు. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ కాగా... మరొకటి సోషల్ వర్కర్ రోల్ అని టాక్. అలాగే... రజనీకి జోడీగా నయనతార, కీర్తి సురేష్ నటించబోతున్నారు.

హారర్ కామెడీ సినిమాలో జాన్వీ కపూర్
`అతిలోక సుందరి శ్రీదేవి తనయ` అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి చిత్రం `ధడక్`తో నటిగా మెప్పించిన జాన్వి... ప్రస్తుతం `కార్గిల్ గాళ్`, `తఖ్త్` చిత్రాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సమాచారం ప్రకారం... ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో ఆసక్తికరమైన చిత్రానికి సంతకం చేసిందని తెలిసింది.

దేవిశ్రీ ప్రసాద్ తొలి చిత్రం `దేవి`కి 20 ఏళ్ళు
మంచి కథకు సాంకేతికత కూడా తోడైతే... వెండితెరపైన అద్భుతాలు చోటుచేసుకుంటాయి. అలా... తెలుగు తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ. భక్తి రస చిత్రాలకు ఆధునిక సాంకేతికతను జోడించి... ఆయన రూపొందించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాలలో `దేవి` ఒకటి. తనను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆసామి పట్ల కృతజ్ఞతతో... అతని కూతురిని దుష్టశక్తుల బారి నుంచి నిరంతరం రక్షించే ఓ నాగదేవత కథగా `దేవి` తెరకెక్కింది. ప్రేమ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో భానుచందర్, సిజ్జూ, వనిత, అబూ సలీమ్, షావుకారు జానకి…

కళ్యాణి ప్రియదర్శన్... డబుల్ ధమాకా
`హలో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కేరళకుట్టి కళ్యాణి ప్రియదర్శన్. మొదటి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా... నటిగా మంచి గుర్తింపునే తెచ్చుకుంది కళ్యాణి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలుపుకుని మొత్తం ఐదు చిత్రాలతో బిజీగా ఉంది. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండడం విశేషం. అందులో ఒకటి... మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న `చిత్రలహరి` కాగా... మరొకటి టాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా.

రిలీజ్ కానున్న చిత్రలహరి మూవీ టీజర్
నేను శైలజ వంటి సూపర్ హిట్ మూవీ దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరో గా చిత్రలహరి మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ కథానాయికలు. టాప్ కమెడియన్స్ సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మణిరత్నం మూవీ లో మరో స్టార్ హీరో
నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్, చెక్క చివంద వానమ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం రాజ రాజ చోళన్ రాజవంశం నేపథ్యంలో ఒక మూవీ రూపొందించనున్నారు. కల్కి కృష్ణమూర్తి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది.

మరో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న మహర్షి
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. అటు మహేష్ అభిమానులే కాదు.. ప్రతి సినీ ప్రేక్షకుడు మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా మహర్షి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి క్లారిటీ ఇచ్చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆకాష్ హీరోయిన్ గా ఢిల్లీ భామ!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ 'రొమాంటిక్' అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ పడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

టర్కిష్ సినిమా రీమేక్ లో!
సినీ కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తరువాత వరుస అపజయాలతో కాస్త వెనకబడ్డాడు. చాలా కాలం నుండి ఒక్క సినిమా కూడా తీయకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే గతంలో చేసినట్టు కాకుండా.. ఈసారి ఆచితూచి ముందడుగు వేయాలని భావిస్తున్న రాజ్ తరుణ్ కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.