నాగశౌర్య కొత్త సినిమాకు టైటిల్ ఖరారు!

Naga Shaurya New Movie Gets A Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Naga Shaurya Latest News,Naga Shaurya Upcoming Movie News,Naga Shaurya Next Film Updates,Naga Shaurya New Movie Details
Naga Shaurya New Movie Gets A Title

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈవిషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. “పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి” అనే డిఫరెంట్ టైటిల్ ను ఈ సినిమా కోసం లాక్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే తెలియజేయనున్నారు.

మరి గతంలో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. అలాగే నాగశౌర్య, మాళవిక నాయర్ కాంబినేషన్ లో కూడా గతంలో ‘కళ్యాణ వైభోగమే’ సినిమా వచ్చిన సంగతి విదితమే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరి ఇప్పుడు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=5gAchzPci2w]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.