ఓవర్ ఆర్కెస్ట్రా తాలూకు రణగొణ ధ్వనుల మధ్య సంగీతం దారి సంగీతంది.. సాహిత్యం దారి సాహిత్యందిగా మారిపోయిన నేపథ్యంలో శ్రవణ శ్రావ్యమైన ఒక పాటను విని ఎంత కాలమైందో..?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా హీరోను అభివర్ణిస్తూ, అభిమానిస్తూ, ఆరాధిస్తూ హీరోయిన్ ఒక చక్కటి మెలోడీని ఆలపించే సన్నివేశాలు, సందర్భాలు ఈ మధ్యకాలంలో కరువైపోయాయి. హీరోను ఏకపక్షంగా ప్రేమిస్తూ తన ప్రేమను వ్యక్తం చేయలేక , మనసులో దాచుకోలేక, ఎగిరే పైటను ఆపలేక, ఎగిసే భావాలను ఓపలేక విరహ వేదనానందంతో వేగిపోతూ ప్రేయసి ఆలపించే విరహ గీతాలాపనలో ఎంత మాధుర్యం ఉంటుందో కదా!
చాలా కాలం తరువాత అలాంటి మధుర మాధుర్య గీతాన్ని వినటం చాలా ఆనందంగా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న చిత్రం “మజిలీ”. రియల్ లైఫ్ జంట నాగ “చైతన్య – సమంత” రీల్ లైఫ్ జంటగా నటించిన” మజిలీ” చిత్రం కోసం చైతన్య ప్రసాద్ రాసిన ఈ సుమ సుందర సాహితీ సౌరభం ప్రస్తుతం మెలోడీ మార్కెట్లో గొప్పగా గుభాళిస్తుంది. సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇచ్చిన ట్యూన్ కు రాసారో లేక తను రాసిన సాహిత్యానికి
ట్యూన్ కట్టారో తెలియదు కానీ గీత రచయిత చైతన్య ప్రసాద్ చిన్న చిన్న పదాలలో గిలిగింతల విరహాన్ని ఆవిష్కరించారు. సుప్రసిద్ధ ఆంగ్ల కవి కీట్స్ చెప్పిన Beauties can be seen in the small proportions of life అనే గొప్ప కొటేషన్ లోని ‘స్మాల్ బ్యూటీస్’ ను చాలా చక్కగా తన సాహిత్యంలో పొందుపరిచారు చైతన్య ప్రసాద్.
నిన్న విడుదలైన ఈ పాట అటు సిటిజెన్స్ లోనూ, ఇటు నెటిజెన్స్ లోనూ సంచలనం సృష్టిస్తుంది.
ఇంతకూ అంత మంచి పాట ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా!
” ప్రియతమా ప్రియతమా.. పలికినది హృదయమే స రి గ మ …. అనే పల్లవితో సాగిన ఈ పాట ప్రస్తుతం ఆడియో మార్కెట్ ను షేక్ చేస్తుంది. చైతన్య ప్రసాద్ సాహిత్యంలోని లాలిత్యాన్ని, గోపి సుందర్ సంగీతం లోని మెలోడీని చక్కగా ఆకళింపు చేసుకుని తన అద్భుత ఆలాపనతో పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకు వెళ్ళింది ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. గతంలో “శారద” చిత్రంలో ‘ నువ్వొస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా’ అన్న పాట, “ప్రియమైన నీకు” చిత్రంలో “మనసున ఉన్నది చెప్పాలనున్నది… మాటలు రావే ఎలా ?” అన్న పాట, “సఖి” చిత్రంలో “స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా”
వంటి సూపర్ హిట్ గీతాల సరసన చేరేంత లవ్లీ మెలోడీని అందించిన “మజిలీ” టీమ్ కు అభినందనలు.
ఈ “మజిలీ” విషయంలో ప్రేక్షకశ్రోతలను అలరించే మరో లవ్లీ థింగ్ నాగ చైతన్య సమంతల కెమిస్ట్రీ. పెళ్లయితే హీరోయిన్ల గ్లామర్ పోతుంది, క్రేజ్ తగ్గుతుంది అనే అపోహలు కేవలం అపోహలు మాత్రమే అని వ్యక్తిగతంగా మరోమారు నిరూపించింది సమంత. అలాగే పెళ్లైన సినీజంట మరలా తెరమీద భార్యాభర్తలుగా కనిపిస్తే కూడా ఆ సినిమా ఆడదు అన్న సెంటిమెంట్ కూడా అసంగతమని ఈ సినిమా ద్వారా నిరూపించ బోతున్నారు నాగ చైతన్య- సమంతల జంట. Let us wish and say all the best to the Entire unit of
Majili.
[youtube_video videoid=7TgSCEQYUpI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: