కథానాయకుడిగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ది 13 ఏళ్ళ నటప్రస్థానం. ఇప్పటివరకు 16 సినిమాలతో వెండితెరపై సందడి చేశాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 17వ చిత్రంగా `ఇస్మార్ట్ శంకర్` చేస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమా తరువాత రామ్ నటించబోయే ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేమిటంటే… తాజాగా విడుదలైన తమిళ చిత్రం `తడమ్` (అరుణ్ విజయ్ హీరో)కి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను రామ్ పెదనాన్న`స్రవంతి` రవికిశోర్, `ఠాగూర్` మధు ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేశారని… ఈ సినిమాలో రామ్ హీరోగా నటించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. మరి… ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. కాగా… రామ్ కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు ఒకే ఒక రీమేక్ సినిమాలో నటించాడు. ఆ చిత్రమే `మసాలా`. ఆ తరువాత మళ్ళీ రీమేక్‌ల జోలికి వెళ్ళని రామ్… మరి `తడమ్`తో ఆరేళ్ళ తరువాత మరో ప్రయత్నం చేస్తాడో లేదో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: