
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 92


బన్నీ సినిమాలో ఆసక్తికమైన విషయం

మహేష్ విషయంలో సేమ్ టు సేమ్...

శివన్ టీజర్ రిలీజ్

దేవి 2 రిలీజ్ డేట్ ఫిక్స్

మరోసారి ఆకట్టుకున్న సమంత

ఒకే నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు

యంగ్ హీరోకి తండ్రి పాత్రలో శ్రీకాంత్?

మహర్షి మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కార్తీ, రష్మిక జంటగా కొత్త సినిమా ప్రారంభం

ఎవరు వెనక్కి తగ్గుతారు?

మొదలైన కె.జి.ఎఫ్ 2

ఆర్ఆర్ఆర్ లో జాయిన్ అయిన ప్రముఖ లిరిసిస్ట్

నాలుగేళ్ళ తరువాత రిపీట్ చేయనున్న నిఖిల్?

నానికి జోడీగా అదితి రావ్ హైదరీ?

దేవిశ్రీ ప్రసాద్ కాదు... గోపీసుందర్ అట!
‘ఊపిరి’(నాగార్జున)… ‘ప్రేమమ్’, ‘మజిలీ’(నాగచైతన్య)… ఇలా అక్కినేని ఫ్యామిలీ హీరోస్ మెమరబుల్ మూవీస్‌లో భాగమైన మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్… ఇప్పుడు అఖిల్ కొత్త సినిమాకి కూడా సంగీతం అందించనున్నాడట.

బన్నీ సినిమాలో ఆసక్తికమైన విషయం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా… ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

మహేష్ విషయంలో సేమ్ టు సేమ్...
మహర్షితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి కానుకగా మే 9న తెరపైకి రానుంది. ఆ తరువాత… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో. కాగా… మహేష్ 25, 26వ చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే… ఆయా చిత్రాల దర్శకుల కెరీర్‌లో సదరు సినిమాలు సంఖ్యా పరంగా ఒకటే కావడం.

శివన్ టీజర్ రిలీజ్
శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఎస్ఆర్ సినీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సంతోష్ రెడ్డి ఎల్ నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ రోజు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు మ్యూజిక్ సిద్దార్థ్ సదాశివుని.

దేవి 2 రిలీజ్ డేట్ ఫిక్స్
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, తమన్నా ప్రధాన పాత్రల్లో 2016 లో రిలీజైన హార్రర్ సినిమా దేవి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో అభినేత్రి అనే టైటిల్ తో ఈ సినిమానురిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. దేవి 2 అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో అభినేత్రి 2 టైటిల్ తో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.

మరోసారి ఆకట్టుకున్న సమంత
పెళ్ళయ్యాక సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అందాల తార సమంత. గత ఏడాది `రంగస్థలం`, `మహానటి`, `యూ టర్న్` చిత్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో కనిపించి అలరించిన సామ్... ఈ ఏడాది కూడా అదే బాటలో వెళ్ళనుంది. `సూపర్ డీలక్స్`, `మజిలీ`, `ఓ బేబి` ... ఇలా తన కొత్త చిత్రాల్లో ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రల్లో సమంత దర్శనమివ్వనుంది.

ఒకే నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు
ఒకే నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజవడం అప్పుడప్పుడు చోటుచేసుకునే వ్యవహారమే. అలా ఈ ఏడాది ఆగస్టు నెలలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు తమిళనాట సందడి చేయనున్నాయి. ఆ హీరోలు మరెవరో కాదు... అజిత్, సూర్య.

యంగ్ హీరోకి తండ్రి పాత్రలో శ్రీకాంత్?
శతాధిక చిత్రాల కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్... గత కొంత కాలంగా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే... మరో వైపు స్టార్ హీరోలకు బాబాయ్ పాత్రల్లో కనిపిస్తున్నాడు. అలాగే విలన్‌గానూ సందడి చేస్తున్నాడు. కాగా... తాజాగా ఓ యువ కథానాయకుడి సినిమాలో తండ్రి పాత్రలో నటించేందుకు ఈ టాలెంటెడ్ యాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్.
చంద్రబాబు నీది ఔరంగజేబు లాంటి నీచ చరిత్ర.. నువ్వు కూడా నీతులు మాట్లాడితే ఎలా?
తన విలక్షణ, విశిష్ట అభినయంతో నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విలక్షణ నటుడు మోహన్ బాబుకు రాజకీయ రంగంలో కూడా చెప్పుకోదగిన చరిత్ర ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా , ఆ పార్టీ ద్వారా రాజ్యసభకు ఎంపిక కాబడిన పార్లమెంటేరియన్ గా, ఆ పార్టీ నుండి బహిష్కరణకు గురై బీజేపీకి ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్ గా రాజకీయ చరిత్ర కలిగిన మోహన్ బాబు తాజాగా వై ఎస్ ఆర్ సి పి పార్టీలో చేరడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి కి కూడా సమీప…

మహర్షి మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందుతున్న మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు స్టూడెంట్ గా, బిజినెస్ మాన్ గా రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న మహర్షి మూవీ లో పూజా హెగ్డే కథానాయిక. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. సోషల్ మెసేజ్ తో పాటు , పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న మహర్షి మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై రూపొందుతుంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్ వచ్చినట్టే!
కేవలం టీజర్, ట్రైలర్, సింగిల్స్ తోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ప్రమోషన్స్ లో ఏదో ఒక కొత్త దనం చూపించే వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో చేసి అందరి అటెన్షన్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా ఎప్పుడొస్తుందా? ఎప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు కూడా లేకపోలేదు.

కార్తీ, రష్మిక జంటగా కొత్త సినిమా ప్రారంభం
కన్నడ సినిమా కిర్రిక్ పార్టీ సినిమాతో హిట్ కొట్టి.. అక్కడి నుండి తెలుగులోకి వచ్చి 'ఛలో, గీతగోవిందం' లాంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మిక మందన. తెలుగులో పలు స్టార్ హీరోల పక్కన సైతం నటించే అవకాశం దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా.. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక అక్కడ కూడా స్టార్ హీరోలతో జోడి కట్టే ఛాన్స్ లు చేజిక్కించుకుంటుంది.

ఎవరు వెనక్కి తగ్గుతారు?
విజయదేవరకొండ ప్రస్తుతం ఫుల్ ఫామ్ ఉన్నాడు. వరుస విజయాలతో.. కొత్త ప్రాజెక్ట్ లతో జిబీ బిజీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం తాను డియర్ కామ్రేడ్ తో పాటు మరో కొత్త సినిమాతో బిజీగా ఉండగానే.. తాజాగా మరో న్యూ ప్రాజెక్ట్ లో నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టుగా చిత్రయూనిట్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు.

ఆ కన్నడ రవిప్రకాష్ ను నేను కాదు బాబోయ్ అంటున్న తెలుగు రవిప్రకాష్
ఒక్కోసారి మీడియా ప్రదర్శించే అత్యుత్సాహం కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేస్తుంది . ఒకరి పేరుకు బదులు వేరొకరి పేరు.. ఒకరి ఫోటోకు బదులు ఇంకొకరి ఫోటో ప్రచురించి అయోమయానికి గురిచేస్తుంది మీడియా . అలాంటి అనుభవమే మన తెలుగు నటుడు రవి ప్రకాష్ కు ఎదురైంది.

బాలీవుడ్ ప్రాజెక్ట్ కు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్
తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గత కొద్ది రోలుజుగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.

మొదలైన కె.జి.ఎఫ్ 2
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా వచ్చిన `కె.జి.ఎఫ్- చాప్టర్ 1` సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం హిందీలో సుమారు 50 కోట్లు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూళ్లు సాధించింది. తెలుగులో వారాహి చలనచిత్రం అధినేత .. సాయి కొర్రపాటి ఈ…

ఆర్ఆర్ఆర్ లో జాయిన్ అయిన ప్రముఖ లిరిసిస్ట్
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్అర్అర్. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా.. మూడో షెడ్యూల్ కూడా త్వరలోనే జరుపుకోనున్నారు. కోల్ కత్తాలో దాదాపు 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో రాజమౌళి ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.

సమంత `లక్కీ సీజన్` సెంటిమెంట్... `మజిలీ`కి రిపీట్ అవుతుందా?
ఈ తరం కథానాయికల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న కథానాయిక... సమంత. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గత చిత్రం `యూ టర్న్` వరకు తన ఖాతాలో పలు విజయాలను నమోదు చేసుకుందీ అందాల తార. కాగా... ఈ టాలెంటెడ్ బ్యూటీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `మజిలీ` ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్ళయ్యాక తన భర్త, కలిసొచ్చిన కథానాయకుడు నాగచైతన్యతో సామ్ నటించిన సినిమా కావడంతో... `మజిలీ`పై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, సింగిల్స్‌తో ఇప్పటికే ఇంప్రెస్ చేసిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

నాలుగేళ్ళ తరువాత రిపీట్ చేయనున్న నిఖిల్?
`హ్యాపీడేస్`(2007)తో తెలుగు తెరకు పరిచయమైన యువ నటుడు నిఖిల్. ఆ తరువాత `యువత`(2008)తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే... `యువత` అనంతరం దాదాపు ఐదేళ్ళు విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది నిఖిల్‌కి. `స్వామి రారా` (2013) రూపంలో దక్కిన ఆ సక్సెస్‌తో మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో... ఆ తరువాత `కార్తికేయ`(2014)తో మరో హిట్‌ని సొంతం చేసుకున్నాడు. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` (2016) లాంటి సినిమాలతోనూ మురిపించాడు. మళ్ళీ విజయాలతో దోబూచులాట తప్పలేదు.

నానికి జోడీగా అదితి రావ్ హైదరీ?
గత ఏడాది విడుదలైన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `సమ్మోహనం`లో తన అందం, అభినయంతో సమ్మోనపరిచింది అందాల తార అదితి రావ్ హైదరీ. అలాగే సొంత డబ్బింగ్‌తో మురిపించింది. అంతేకాదు...`సమ్మోహనం` తరువాత వచ్చిన `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్`తోనూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం తమిళ చిత్రం `సైకో`తో బిజీగా ఉన్న అదితి... అతి త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశముందని ఫిల్మ్‌నగర్ టాక్.