స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చెన్నైలో రెండు కీలకమైన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా మూడో షెడ్యూల్ విషయంలో మాత్రం ఓ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మూడో షెడ్యూల్ మాత్రం మే నెల చివరిలో ప్రారంభం కానుందట. దీనికి కారణం ఎన్నికలే. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మే నెల చివరి వరకూ షూటింగ్ కు గ్యాప్ ఇవ్వనున్నారట కమల్. డైరెక్టర్ శంకర్, సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేతలను కమల్ రిక్వెస్ట్ చేయడంతో వారు కూడా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మే చివరి వరకూ జనరల్ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో తన పార్టీ మక్కల్ నిధి మయమ్ పార్టీ తరపున ఎన్నికల్లో పాల్గొని.. ఎలక్షన్స్ అయిపోయిన తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నారు. దీన్నిబట్టి చూస్తే కమల్ పొలిటిక్స్ ను సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.
కాగా ఈసినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. శింబు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో చేయనున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మరి ఈ సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో చూద్దాం..
[youtube_video videoid=jA0xiSGBGQs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: