బాహుబలి సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన రాజమౌళి.. ఇప్పుడు కోల్ కతా లో 40 రోజుల పాటు ఇద్దరు హీరోలతో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ టీమ్ మరో సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను తెలియజేసేందుకుగానూ ఈనెల 14న హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కు చిత్రబృందంలోని కీలక సభ్యులతో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా హాజరవుతున్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఏం చెప్తారో ఏ విషయాలను రివీల్ చేస్తారో చూడాలి. హీరోయిన్ల గురించి ఆ ప్రెస్ మీట్ లో అన్నా చెబుతారో? లేదో? చూద్దాం.
Team #RRR will be interacting with the media on 14th March in Hyderabad… @ssrajamouli @tarak9999 #RamCharan @dvvmovies @RRRMovie
— RRR Movie (@RRRMovie) March 12, 2019
కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=-fIckspYhns]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: