వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందుతున్న మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు స్టూడెంట్ గా, బిజినెస్ మాన్ గా రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న మహర్షి మూవీ లో పూజా హెగ్డే కథానాయిక. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. సోషల్ మెసేజ్ తో పాటు , పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న
మహర్షి మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహర్షి మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశ లో ఉన్న మహర్షిమూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ మార్చి 29 వ తేదీ ఉదయం 9.09 గంటలకు రిలీజవుతుందని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహర్షి మూవీ మ్యూజికల్ జర్నీ ప్రారంభ సందర్భంగా ఒక కొత్త పోస్టర్ ను దర్శకుడు రిలీజ్ చేశారు.
[youtube_video videoid=6ZBLDETIFDM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: