యంగ్ హీరోకి తండ్రి పాత్ర‌లో శ్రీ‌కాంత్‌?

Srikanth To Play Father Role?

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న శ్రీ‌కాంత్‌… గ‌త కొంత కాలంగా వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఓ వైపు హీరోగా న‌టిస్తూనే… మ‌రో వైపు స్టార్ హీరోల‌కు బాబాయ్ పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నాడు. అలాగే విల‌న్‌గానూ సంద‌డి చేస్తున్నాడు. కాగా… తాజాగా ఓ యువ క‌థానాయ‌కుడి సినిమాలో తండ్రి పాత్ర‌లో న‌టించేందుకు ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ టాక్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `ఏమిటో ఈ మాయ‌`, `సూర్యకాంతం` చిత్రాల క‌థానాయ‌కుడు రాహుల్ విజ‌య్ ఓ క‌న్న‌డ రీమేక్ లో న‌టించ‌నున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా రూపొంద‌నున్న ఈ సినిమా కోస‌మే శ్రీ‌కాంత్ తండ్రి పాత్ర‌లో న‌టించేందుకు అంగీకారం తెలిపాడ‌ట‌. త‌మిళ వెర్ష‌న్‌లో ప్ర‌భు ఈ పాత్ర‌ చేస్తాడ‌ని టాక్‌. వ‌చ్చే నెల‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి. మ‌రి… రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌కు బాబాయ్‌గా అచ్చొచ్చిన శ్రీ‌కాంత్‌… రాహుల్‌కి తండ్రిగా క‌లిసొస్తాడేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=NcT3Tk1e8jI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here