ఏఎల్ విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవ, తమన్నా ప్రధాన పాత్రల్లో 2016 లో రిలీజైన హార్రర్ సినిమా దేవి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో అభినేత్రి అనే టైటిల్ తో ఈ సినిమానురిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. దేవి 2 అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో అభినేత్రి 2 టైటిల్ తో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు చిత్రయూనిట్. అయితే ఇప్పుడు తాజాగా సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 31వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. కాగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈసినిమా ఎంత వరకూ భయపెడుతుందో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=_ML0-srkxNg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























