మహర్షితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి కానుకగా మే 9న తెరపైకి రానుంది. ఆ తరువాత… తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో. కాగా… మహేష్ 25, 26వ చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. అదేమిటంటే… ఆయా చిత్రాల దర్శకుల కెరీర్లో సదరు సినిమాలు సంఖ్యా పరంగా ఒకటే కావడం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రం మహర్షి తెరకెక్కితే… పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 తరువాత మహేష్ కాంబినేషన్ మూవీని రూపొందించనున్నాడు అనిల్ రావిపూడి. అంటే… అటు వంశీ పైడిపల్లి, ఇటు అనిల్ రావిపూడి తమ తమ ఐదవ చిత్రాలను మహేష్‌తోనే తెరకెక్కిస్తున్నారన్నమాట. బ్యాక్ టు బ్యాక్… నాలుగు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో మహేష్ చేస్తున్న ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=TkA7tJ_hWSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























