తెలుగు, తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. గత కొద్ది రోలుజుగా కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్‌ను కొట్టేసింది కీర్తి సురేష్. ఇక కీర్తి కి కూడా స్టోరీ నచ్చడంతో సైన్ కూడా చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ‘తానాజీ’ సినిమాతో బిజీగా ఉన్న అజయ్ దేవగన్ ఆ సినిమా తరువాత ఈ సినిమాలో నటించనున్నారు. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా, బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఆకాశ్ చావ్లా, అరునవ జాయ్ సేన్‌గుప్తా ఈసినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తోంది.
మరి తన అందం, అభినయంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్.. ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించడానికి వెళ్తున్నారు. మరి అక్కడి ప్రేక్షకులకు ఎంత వరకూ నచ్చుతుందో చూద్దాం.
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: