కేవలం టీజర్, ట్రైలర్, సింగిల్స్ తోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ప్రమోషన్స్ లో ఏదో ఒక కొత్త దనం చూపించే వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తనదైన శైలిలో చేసి అందరి అటెన్షన్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా ఎప్పుడొస్తుందా? ఎప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు కూడా లేకపోలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం పలు సందేహాలు ఏర్పడ్డాయి. ఓ తెలుగు దేశం కార్యకర్త ఈసీ ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో సినిమా రిలీజ్ పై అనుమానాలు తలెత్తాయి. ఇక వర్మ అయితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకుండా ఎవరూ ఆపలేరని.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం, సెన్సార్ బోర్డు మినహా ఎవరూ సినిమాను ఆపలేరని అన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని భావించి, సెన్సార్ బోర్డు అడ్డుకుంటే వారికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు
కానీ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్(సిఈవో) మాటలు చూస్తుంటే రిలీజ్ కు ఎలాంటి ప్రాబ్లమ్ లేనట్టే కనిపిస్తోంది. ఈ సినిమా వివాదంపై మాట్లాడిన ఆయన ఈసినిమాను ఆపే రైట్ ఈసీకు లేదని.. ఒక సినిమా చూసి పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసినట్టు కానీ..ఇంకా వేరే విధంగా ఉన్నప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది… అంతేకానీ.. సినిమా రిలీజ్ ముందే ఈసీ యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.. దీనిపై ఈసీ ఇంకా యాక్షన్ తీసుకోలేదని తెలిపారు.
మొత్తాని సీఈవో మాటలను బట్టి చూస్తుంటే సినిమా రిలీజ్ కు మాత్రం ఎలాంటి అడ్డులేనట్టే కనిపిస్తోంది. ఇక నా సినిమాను ఎవరూ ఆపలేరని ముందు నుండి వర్మ కూడా చెబుతున్నాడు. మరి వర్మ కు తెలియని రూల్సా.. వర్మ కు తెలియని లా పాయింట్సా ఇవన్నీ..అందుకే అంత ధీమాగా ఉన్నట్టున్నాడు వర్మ. చూద్దాం మరి ఏం జరుగుతందో..
[youtube_video videoid=3OftuTIrF_4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: