ఒక్కోసారి మీడియా ప్రదర్శించే అత్యుత్సాహం కొంతమంది సెలబ్రిటీలను ఇబ్బందుల పాలు చేస్తుంది . ఒకరి పేరుకు బదులు వేరొకరి పేరు.. ఒకరి ఫోటోకు బదులు ఇంకొకరి ఫోటో ప్రచురించి అయోమయానికి గురిచేస్తుంది మీడియా . అలాంటి అనుభవమే మన తెలుగు నటుడు రవి ప్రకాష్ కు ఎదురైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకూ జరిగిందేమిటంటే…
కన్నడంలో కూడా రవి ప్రకాష్ అనే యాక్టర్ ఒకతను ఉన్నాడు. అతడు విజయలక్ష్మి అనే కన్నడ నటికి లక్ష రూపాయలు అప్పు ఇచ్చాడట. మరి సహాయం చేశానన్న అడ్వాంటేజ్ తీసుకున్నాడో లేక అసలు ఏం జరిగిందో తెలియదు గాని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆ విజయలక్ష్మి ఆ రవిప్రకాశ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దానిని ఆ రవి ప్రకాష్ ఖండిస్తూ పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది… కానీ ఈ వార్తను ప్రచురిస్తూ కొన్ని వెబ్ సైట్స్ కన్నడ రవిప్రకాష్ ఫోటోకు బదులు తెలుగు రవి ప్రకాష్ ఫోటోను వేసారు.
కాగా మన తెలుగు రవిప్రకాష్ ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఉత్సాహంలో ఉండగా ఈ ఫోటోల తారుమారు వ్యవహారం అతనికి న్యూసెన్స్ లా తయారయింది. అందుకే మన రవిప్రకాష్ “ఆ రవిప్రకాష్ ను నేను కాదు బాబోయ్” అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇలాంటి వివాదాలను వేడివేడిగా వండి వడ్డించే మన మీడియా మిత్రులు ఇలాంటి పొరపాట్లు జరిగినప్పుడు సవరణ వేయడానికి మాత్రం చాలా తాత్సారం చేస్తారు. మన రవి ప్రకాష్ తెలుగు ఇండస్ట్రీలో ఒక నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్మెన్. తన పని తాను చేసుకోవడం తప్ప ఎలాంటి వివాదాలలో తలదూర్చని రవి ప్రకాష్ అంటే టాలీవుడ్ లో అందరికీ అభిమానం. వృత్తిరీత్యా డాక్టర్ అయిన రవి ప్రకాష్ ప్రవృత్తి రీత్యా యాక్టర్ అయ్యారు. ఆయన భార్య మాధురి కూడా డాక్టరే. ఒక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన రవి ప్రకాష్ పేరు ఇలాంటి అనవసర
వివాదంలో వినిపించటం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది.
ప్రస్తుతం ఒరిస్సాలోని రాయగడలో “రంగం” ఫేమ్ కె.వి ఆనంద్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ సూర్య హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం షూటింగ్ లో ఉన్నారు రవి ప్రకాష్. కాబట్టి ఈ వార్తకు సంబంధించిన ఫోటోను తప్పుగా ప్రచురించిన మీడియా సోదరులు జరిగిన పొరపాటు గ్రహించి వెంటనే సవరణ వేయండి ప్లీజ్ అంటున్నారు రవి ప్రకాష్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: