పెళ్ళయ్యాక సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అందాల తార సమంత. గత ఏడాది `రంగస్థలం`, `మహానటి`, `యూ టర్న్` చిత్రాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో కనిపించి అలరించిన సామ్… ఈ ఏడాది కూడా అదే బాటలో వెళ్ళనుంది. `సూపర్ డీలక్స్`, `మజిలీ`, `ఓ బేబి` … ఇలా తన కొత్త చిత్రాల్లో ఇదివరకు ఎన్నడూ చేయని పాత్రల్లో సమంత దర్శనమివ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… వీటిలో `సూపర్ డీలక్స్` ఈ రోజు (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో సామ్ ఓ కొత్త తరహా పాత్రలో నటించింది. మొదటి ఆటకే డిఫరెంట్ మూవీ అనే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో సామ్ క్యారెక్టర్, యాక్టింగ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి… గత కొంతకాలంగా నటిగా తిరుగులేని ఫామ్‌లో ఉన్న సమంత కొత్త చిత్రంతో మరోసారి ఆకట్టుకుందన్నమాట. త్వరలోనే `సూపర్ డీలక్స్` తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది.
[youtube_video videoid=0nmTiPR-AEY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: