స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత మరోసారి జట్టుకట్టిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా… ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయముంది. అదేమిటంటే… నిన్నటి తరం కథానాయకులు, ఈ తరం కథానాయకులు… ఇలా మొత్తంగా అరడజను మంది హీరోలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సీనియర్ హీరోలు రాజేంద్రప్రసాద్, సత్యరాజ్‌తో పాటు కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన బ్రహ్మాజీ, నవదీప్, సునీల్ కూడా ఇందులో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అలాగే… యువ కథానాయకుడు సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొత్తమ్మీద… బన్నీ చిత్రంలో పాత, కొత్త తరానికి చెందిన ఆరుగురు హీరోలు నటించనుండడం విశేషమనే చెప్పాలి.
[subscribe]
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























