
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 91


టైటానిక్ ను ముంచేసిన అవెంజర్స్

లొకేషన్ల వేటలో సుకుమార్?

అనిల్ కపూర్‌కి ఈ ఏడాది ఎంతో స్పెషల్

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెహరీన్?

నేను చేసుకున్న అదృష్టం - కీర్తి సురేష్

చిత్ర లహరి క్లోజింగ్ కలెక్షన్స్

న్యాచురల్ స్టార్ చేతుల మీదగా కల్కీ ట్రైలర్ రిలీజ్

ఆసక్తి రేకెత్తిస్తున్న సెవెన్ ట్రైలర్

100 కోట్ల క్లబ్ లో కాంచన 3

సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఈ ఏడాది ఆరు సినిమాలు

కార్తికేయ మూవీ టైటిల్ గుణ 369

మూడు దశాబ్దాల తరువాత వెండి తెరకు

అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ మౌత్ టాక్

28డిగ్రీస్ సెల్సియస్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మే నుంచి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ చిత్రం?

అల్లాదిన్ మూవీ కి వెంకటేష్, వరుణ్ తేజ్ వాయిస్

శోభన్‌బాబు ‘కార్తీకదీపం’కు 40 ఏళ్ళు
కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో శోభన్‌బాబు ఒకరు. అలా శోభన్‌బాబు నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించాయి. వాటిలో ‘కార్తీకదీపం’ ఒకటి. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. గీత కీలక పాత్రలో నటించగా గుమ్మడి, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, రమాప్రభ తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సత్యం స్వర సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా “ఆరనీకుమా ఈ దీపం”, “చిలకమ్మా పలికింది”, “నీ కౌగిలిలో తలదాచి” వంటి పాటలు ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌గా నిలిచాయి. 1979 మే 10న…

టైటానిక్ ను ముంచేసిన అవెంజర్స్
అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. మార్వెల్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు భయపడి పలు సినిమాల రిలీజ్ డేట్లను మార్చుకుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఏంటో.. ఇప్పటికే రూ.15,302 కోట్లను దాటేసి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఎన్నో సినిమాల రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా.. తాజాగా.. టైటానిక్ సినిమా కలెక్షన్లను బీట్ చేసింది. 1997లో వచ్చిన టైటానిక్ సినిమా ఏకంగా రూ.15,000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది.

చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ -అల్లరి నరేష్
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజయి సూపర్ హిట్ దిశగా సాగుతుంది. ఈ మూవీ లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. మహర్షి సినిమాలో క్యారెక్టర్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్ 2002 సంవత్సరం లో అల్లరి మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి 55 సినిమాలు పూర్తిచేసుకున్నారు.

లొకేషన్ల వేటలో సుకుమార్?
గతంలో స్మగ్లింగ్ ప్రధానాంశంగా అటవీ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఈ నేపథ్యానికి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని జోడిస్తూ ఓ తెలుగు సినిమా రాబోతోంది.

అనిల్ కపూర్‌కి ఈ ఏడాది ఎంతో స్పెషల్
బాపు రూపొందించిన తెలుగు చిత్రం ‘వంశ వృక్షం’తో కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. తదనంతరం బాలీవుడ్‌లో ‘మిస్టర్ ఇండియా’, ‘తేజాబ్’ తదితర పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అక్కడ అగ్ర కథానాయకుడిగా రాణించాడు. అంతేకాదు… మల్టీస్టారర్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ కపూర్… ఇప్పటికీ యంగ్ హీరోస్ సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో అలరిస్తున్న అనిల్‌కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే… అటు కూతురు సోనమ్ కపూర్‌కి, ఇటు కొడుకు హర్షవర్షన్ కపూర్‌కి వేర్వేరు సినిమాల కోసం తండ్రిగా…

బాలకృష్ణ సినిమాలో లేడీ విలన్?
‘పందెం కోడి 2’, ‘సర్కార్’, ‘మారి 2’ వంటి తమిళ అనువాద చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్. ఆ యా చిత్రాల్లో విలనిజాన్ని పండించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ సారి తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెహరీన్?
కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది మెహరీన్. ఇక ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2తో మరో సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకుందీ స్టన్నింగ్ బ్యూటీ. ఈ సినిమాలో హనీగా ఆకట్టుకున్న మెహరీన్… స్వల్ప విరామం తరువాత కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడిందని టాక్. ఇప్పటికే యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా మెహరీన్ ఎంపికైనట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో సినిమాలో కూడా మెహరీన్ కథానాయికగా ఎంపిక అయినట్టు టాలీవుడ్ టాక్.

నేను చేసుకున్న అదృష్టం - కీర్తి సురేష్
తనలా ఎవరూ నటించలేదు.. నటించలేరు కూడా… ధనం, కీర్తి అంతటి వైభోగం.. వైభవం తనలా జీవించిన వారు లేరు.. తన నటనతో.. నటనకే అర్థం చెప్పిన నటి.. మహానటి.. ఇప్పటికే ఆమె ఎవరో గుర్తొచ్చే ఉంటుంది. అలనాటి అందాల తార సావిత్రి. తెలుగు తెర చందమామగా అభిమానులతో నీరాజనాలు అందుకున్నారు సావిత్రి. అలాంటి అందమైన జీవితాన్ని ఆఖరి రోజుల్లో విషాదంలా మార్చుకొని.. విషాదమైన మరణాన్ని పొందారు. కానీ ఆమె సినిమాలు.. ఆమె నటన సినీ పరిశ్రమకు ఒక గ్రంధాలయం లాంటివి.

చిత్ర లహరి క్లోజింగ్ కలెక్షన్స్
డిజాస్టర్లలో వున్న సాయి తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా చూసిన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 12వ తేదీన రిలీజై మంచి టాక్ ను సంపాందించుకున్న ఈసినిమా.. కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యాచురల్ స్టార్ చేతుల మీదగా కల్కీ ట్రైలర్ రిలీజ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ కల్కీతో రాజశేఖర్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఆసక్తి రేకెత్తిస్తున్న సెవెన్ ట్రైలర్
ఆరుగురు అమ్మాయిలు… ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే ఇలాంటి సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా సెవెన్. నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సెవెన్ లో హవీష్ కథానాయకుడిగా.. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో నటిస్తున్న ఒక్కోక్కరి పాత్రను ఒక్కో పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్రయూనిట్. దీంతో ఈ థ్రిల్లర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

100 కోట్ల క్లబ్ లో కాంచన 3
ఈ నెలలో వచ్చిన మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు మంచి హిట్స్ ను తెచ్చిపెట్టారు. ఎమోషనల్ డ్రామాలుగా తెరకెక్కిన ఈ మూడు సినిమాలు ప్రేక్షకులకు నచ్చడంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. వీటితో పాటు డిఫరెంట్ జోనర్ లో వచ్చిన కాంచన సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన విడుదలైన ఈ సినిమా బి సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అంతేకాదు మొదటినుండి జెర్సీ కలెక్షన్స్ కు మంచి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఈ ఏడాది ఆరు సినిమాలు
సురేష్ ప్రొడక్షన్స్.. మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో సురేష్ ప్రొడక్షన్ కూడా ఒకటి. ఎన్నో ఏళ్ల క్రితం స్థాపించిన ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు నిర్మించబడ్డాయి. అటు పెద్ద పెద్ద సినిమాలతో పాటు పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం లాంటి చిన్న సినిమాలను కూడా తమ ప్రొడక్షన్ హౌస్ నుండి రిలీజ్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈఏడాది ఏకంగా ఆరు సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది.

అవెంజర్స్ ఎండ్ గేమ్ రివ్యూ
సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంటుంది.. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్స్ట్ తో ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే.. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. చూసిన వారికి మాత్రం కొత్త అనుభూతిని ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

కార్తికేయ మూవీ టైటిల్ గుణ 369
సెన్సేషనల్ హిట్ RX 100 మూవీ తో యూత్ లో యెనలేని క్రేజ్సంపాదించుకున్న కార్తికేయ హీరోగా TM కృష్ణ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరో కార్తికేయ, దర్శకుడు బోయపాటి శ్రీను వద్ద 12సంవత్సరాలు అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. అర్జున్ జంధ్యాల ఈ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

మూడు దశాబ్దాల తరువాత వెండి తెరకు
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లను తెరకెక్కించారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు… ఇలా అన్ని రంగాలకు చెందిన వారి బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్, మోడీ, మన్మోహన్ సింగ్ ఇలా పలు రాజకీయ నేతల బయోపిక్ లు తెరకెక్కించగా.. ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఆ రాజకీయ నేత ఎవరో కాదు దేవినేని నెహ్రూ.

అవెంజర్స్: ఎండ్ గేమ్ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

28డిగ్రీస్ సెల్సియస్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాతలో తెరకెక్కుతున్న సినిమా 28డిగ్రీస్ సెల్సియస్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. మరోసారి నవీన్ చంద్ర ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 27) మధ్యాహ్నం 2.30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మే నుంచి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ చిత్రం?
2018 సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో టాలీవుడ్‌కు తొలి విజయాన్ని అందించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. కట్ చేస్తే… ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లాదిన్ మూవీ కి వెంకటేష్, వరుణ్ తేజ్ వాయిస్
ప్రేక్షకులను అలరించిన కార్టూన్ సీరియల్ అల్లా దిన్ ను వాల్ట్ డిస్నీ పిక్చర్స్ గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ గా రూపొందించింది. జీనీ గా విల్ స్మిత్, అల్లా దిన్ గా మేనా మసూద్, ప్రిన్స్ జాస్మిన్ గా నయోమి స్కాట్ నటించిన మ్యూజికల్, రొమాంటిక్, ఫాంటసీ, ఎడ్వంచర్ ఫిల్మ్ మే నెల 24 వ తేదీ రిలీజ్ కానుంది.