గత ఏడాది విడుదలైన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `సమ్మోహనం`లో తన అందం, అభినయంతో సమ్మోనపరిచింది అందాల తార అదితి రావ్ హైదరీ. అలాగే సొంత డబ్బింగ్‌తో మురిపించింది. అంతేకాదు…`సమ్మోహనం` తరువాత వచ్చిన `అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్`తోనూ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం తమిళ చిత్రం `సైకో`తో బిజీగా ఉన్న అదితి… అతి త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశముందని ఫిల్మ్‌నగర్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `సమ్మోహనం` దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు కథానాయకుడిగా ఓ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇందులో నేచురల్ స్టార్ నాని ఓ డిఫరెంట్ రోల్‌లో సందడి చేయనున్నాడు. కాగా… ఆ పాత్రకి జోడీగా అదితి నటించనుందని సమాచారం. అదే గనుక జరిగితే… నాని, అదితి కాంబోలో వచ్చే తొలి చిత్రమిదే అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావచ్చు.
ఇక `సైకో` విషయానికి వస్తే… `డిటెక్టివ్` ఫేమ్ మిస్కిన్ రూపొందిస్తున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: