
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 70


కె.జి.ఎఫ్ 2 షూట్ లో జాయిన్ అయిన అధీర

అంకితభావం తో నిశ్శబ్దంమూవీ క్యారెక్టర్

ప్రభాస్ కు విలన్ గా..!
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత

బిగ్ బీ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి

మ్యూజికల్ హిట్ 'శ్రీనివాస కళ్యాణం' 32 ఏళ్ళు

నటసింహ బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’కి 17 ఏళ్ళు

ఊరంతా అనుకుంటున్నారు..! రిలీజ్ డేట్ ఫిక్స్

పండగలను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజర్స్

పండగలను టార్గెట్ చేసుకున్న మెహరీన్

'గద్దల కొండ గణేష్' పై మహేష్ ప్రశంసలు

శ్రద్దా ఖాతాలో రెండు సెంచరీలు

'సేవ్ కావేరి'కి తనవంతు చేయూతనిస్తున్న సంజన

నాగ్-చై బంగార్రాజు మూవీ అప్ డేట్..!

20 ఇయర్స్ తరువాత "ఉపేంద్ర " మూవీ రీరిలీజ్

పాట చిత్రీకరణలో ఆది పినిశెట్టి `క్లాప్`
కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

'గద్దలకొండ గణేష్' 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఈ సినిమాను 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీనితో మరో 7.9 కోట్ల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుంటుంది. ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో…

కె.జి.ఎఫ్ 2 షూట్ లో జాయిన్ అయిన అధీర
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా, కన్నడలో 100 కోట్లు వసూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ రేర్ ఫీట్ ను దాటి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం ?
లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. తమిళనాడు కింగ్ రాజ రాజచోళన్ జీవిత చరిత్ర స్టోరీ తో రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ లో అమితాబ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి , మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ నటించనున్నారు.

అంకితభావం తో నిశ్శబ్దంమూవీ క్యారెక్టర్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం పూర్తిగా US లో షూటింగ్ జరుపుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైకేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ మూవీ తెలుగు లో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానుంది.

ప్రభాస్ కు విలన్ గా..!
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే ఇటలీ రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ లో భాగంగానే టీమ్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తుంది.
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కామెడియన్లలో ఒకరైన వేణు మాధవ్ ఈ రోజు తుది శ్వాస వదిలారు. గతకొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వేణు మాధవన్ నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు.

బిగ్ బీ కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి
5దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ కు సేవలందిస్తున్న అమితాబ్ బచ్చన్ ను మరో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 1969 సంవత్సరంలో సాత్ హిందుస్తానీ మూవీ తో బాలీవుడ్ కు పరిచయమైన అమితాబ్5దశాబ్దాలుగా వందలాది చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు. అమితాబ్ నటించిన అనేక మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

మ్యూజికల్ హిట్ 'శ్రీనివాస కళ్యాణం' 32 ఏళ్ళు
“నిజమైన ప్రేమ... ప్రేమించేవారి సంతోషాన్ని కోరుకుంటుంది. వారి కోసం ఏమైనా చేసేలా ప్రేరేపిస్తుంది”... ఇలా ఆలోచించే ఓ పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఏడో చిత్రంగా విడుదలై మంచి విజయం సాధించిన ఈ ముక్కోణపు ప్రేమకథలో భానుప్రియ, గౌతమి కథానాయికలుగా నటించారు. ముఖ్యంగా... తను ప్రేమించిన బావ (వెంకటేష్) కోసం ఏమైనా చేసే సరోజ అలియాస్ స్వప్న పాత్రలో గౌతమి అభినయం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలచింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, గొల్లపూడి మారుతీరావు, సుత్తి వేలు, ‘శుభలేఖ’ సుధాకర్, వంకాయల సత్యనారాయణ, వరలక్ష్మి…

నటసింహ బాలకృష్ణ ‘చెన్నకేశవరెడ్డి’కి 17 ఏళ్ళు
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి, ‘నరసింహనాయుడు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. చెన్నకేశవరెడ్డిగా, భరత్‌గా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో శ్రియా శరన్, టబు నాయికలుగా నటించారు. దేవయాని, పృథ్వీరాజ్, చలపతిరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, దేవన్, ఎల్.బి.శ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత బెల్లంకొండ…

ఊరంతా అనుకుంటున్నారు..! రిలీజ్ డేట్ ఫిక్స్
నందిని నర్సింగ్ హోమ్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఇప్పుడు తాజాగా మరో సినిమాతో రానున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ ను చేశారు చిత్రయూనిట్.ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు.
సెన్సేషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శుభలగ్నం’కు 25 ఏళ్ళు
"కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్లకూడదు. మనసు వెళ్ళిన చోటి కల్లా మనిషి వెళ్లకూడదు!"... ఈ పాయింట్‌తో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం `శుభలగ్నం`. సిరి మైకంలో కట్టుకున్న భర్తని కూడా అమ్ముకుని... ఆనక తప్పుని సరిదిద్దుకునే ఓ మగువ కథతో ‘శుభలగ్నం’ తెరకెక్కింది. జగపతిబాబు, ఆమని, రోజా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించాడు. సుహాసిని, కోట శ్రీనివాసరావు, ఏవీయస్, గుమ్మడి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, గుండు హనుమంతరావు, అలీ, సుబ్బరాయ శర్మ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా... సౌందర్య ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

పండగలను టార్గెట్ చేసుకున్న ఆర్మీ మేజర్స్
ఆర్మీ నేపథ్యంలో తెలుగునాట పలు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు చేరుతున్నాయి. ఆ చిత్రాలే... `సరిలేరు నీకెవ్వరు`, `వెంకీమామ`. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకులు వీరజవాన్లుగా నటిస్తుండడం ఓ విశేషమైతే.... ఆ యా చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్‌లోనే రిలీజ్ కానుండడం మరో విశేషం.

పండగలను టార్గెట్ చేసుకున్న మెహరీన్
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకుంది పంజాబీ జాబిలి మెహరీన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ... `చాణక్య`, `ఎంత మంచివాడవురా`(తెలుగు), `పటాస్` (తమిళ్), `అదాబ్ ముతియరాన్` (పంజాబి) చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... మెహరీన్ నాయికగా నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా పండగలనే టార్గెట్ చేసుకుని రిలీజ్ కానున్నాయి.

'గద్దల కొండ గణేష్' పై మహేష్ ప్రశంసలు
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకి హైలైట్ వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. మొదటిసారి నెగెటివ్ షేడ్ లో చేసిన వరుణ్ తేజ్ గెటప్ కు, వరుణ్ తేజ్ డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను చూసిన సెలెబ్రిటీస్ అందరూ కూడా గద్దల కొండ గణేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ మూడవ సాంగ్ రిలీజ్
రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి వివాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాస్పద చిత్రం కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్ జి వి దర్శకత్వంలో రూపొందుతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ లోని 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి . ఆ రెండు సాంగ్స్ లో ఒక సాంగ్ వర్మ గానం చేయడం విశేషం.

శ్రద్దా ఖాతాలో రెండు సెంచరీలు
మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కి బాగానే కలిసొచ్చింది చెప్పొచ్చు. వెంట వెంటనే తెలుగులోనూ.. అటు హిందీలోనూ హిట్స్ కొట్టి రెండు సెంచరీలు కొట్టింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా టాక్ తో సంబంధ లేకుండా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది చెప్పొచ్చు. హిందీలో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.

'సేవ్ కావేరి'కి తనవంతు చేయూతనిస్తున్న సంజన
సేవ్ కావేరి.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. కావేరి నది జలాల పరిరక్షణకు, పర్యావరణానికి సద్గురు అండ్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావేరి కాలింగ్ పేరు తో ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సేవ్ కావేరి పేరుతో సద్గురు జగ్గీ వాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంగతి తెలిసిందే.

నాగ్-చై బంగార్రాజు మూవీ అప్ డేట్..!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమాతో బిజీ గా ఉన్నాడు. నాగార్జున మొన్నటివరకూ మన్మథుడు2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాగార్జున మన్మథుడు2 సినిమా రిలీజ్ అయిపోయింది. నాగ చైతన్య సినిమా వెంకీమామ ముగింపుదశకు వచ్చింది.

20 ఇయర్స్ తరువాత "ఉపేంద్ర " మూవీ రీరిలీజ్
అతిథి పాత్రలలో శాండల్ వుడ్ కు నటుడిగా పరిచయమైన ఉపేంద్ర తర్లే నన్మగ మూవీ తో దర్శకుడిగా మారి ఓం, స్వస్తిక్ వంటి మూవీస్ కు దర్శకత్వం వహించారు. హీరోగా, దర్శకుడిగా రూపొందిన A మూవీ తో ఉపేంద్ర విజయం సాధించారు . శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉపేంద్ర హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ఉపేంద్ర 1999 అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఉపేంద్ర మూవీ లో ప్రేమ, దామిని, రవీనా టాండన్ కథానాయికలు. రవీనా కు కన్నడంలో తొలిపరిచయ చిత్రం.