లెజెండరీ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ రచయిత కల్కి నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఈ మూవీ రూపొందనుంది. తమిళనాడు కింగ్ రాజ రాజచోళన్ జీవిత చరిత్ర స్టోరీ తో రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ లో అమితాబ్ బచ్చన్, విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి , మోహన్ బాబు, ఐశ్వర్య రాయ్, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరో, హీరోయిన్స్ నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
800 కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా రూపొందనున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 12 సాంగ్స్ తో సంగీత భరితంగా రూపొందనుంది. అందాల తార ఐశ్వర్య రాయ్ ఈ మూవీ లో తల్లీకూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ తో రూపొందనున్న పాన్ ఇండియన్ ఫిల్మ్పొన్నియిన్ సెల్వన్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: