కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. దినేశ్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్న ఈ స్పెష్ల్ సాంగ్‌లో మోనాల్ గజ్జర్ నటిస్తున్నారు.
కాగా ప్రిత్వి ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నాజర్, ప్రకాష్ రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మిమే గోపి, సూర్య, మీనా, వాసు తదితరులు నటిస్తున్నారు. ఐబీ కార్తికేయన్ సమర్పణలో శ్రీ షిరిడీసాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లోతెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు తెలుస్తుంది.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
డిఒపి: ప్రవీణ్ కుమార్
ఆర్ట్: వైర బాలన్
ఎడిటర్: రాగుల్
ఫైట్స్ : శరవణన్
సమర్పణ: ఐబీ కార్తికేయన్
కో-ప్రొడ్యూసర్స్: ఫై.ప్రభ ప్రేమ్,జి.మనోజ్, జి.శ్రీహర్
నిర్మాతలు; రామాంజనేయులు జవ్వాజి, యం. రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం; ప్రిత్వి ఆదిత్య
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: