ఆర్మీ నేపథ్యంలో తెలుగునాట పలు చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో రెండు ఆసక్తికరమైన సినిమాలు చేరుతున్నాయి. ఆ చిత్రాలే… `సరిలేరు నీకెవ్వరు`, `వెంకీమామ`. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకులు వీరజవాన్లుగా నటిస్తుండడం ఓ విశేషమైతే…. ఆ యా చిత్రాలు ఫెస్టివల్ సీజన్స్‌లోనే రిలీజ్ కానుండడం మరో విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ `వెంకీమామ`లో… చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా రానుంది. ఇక `సరిలేరు నీకెవ్వరు` విషయానికి వస్తే ఇందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి… పండగల సమయాల్లో రానున్న ఈ వీర సైనికుల కథలు… ప్రేక్షకులను ఏ స్థాయిలో రంజింపజేస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: