పండ‌గ‌ల‌ను టార్గెట్ చేసుకున్న మెహ‌రీన్‌

Actress Mehreen Pirzada Upcoming Movie News, Heroine Mehreen Pirzada Next Project Details, Latest Telugu Movies News, Mehreen Pirzada Latest News, Mehreen Pirzada New Movie Deatils, Mehreen Pirzada Next Film Updates, Mehreen Upcoming Movies Releasing For Festivals, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2`తో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకుంది పంజాబీ జాబిలి మెహ‌రీన్‌. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ… `చాణ‌క్య‌`, `ఎంత మంచివాడ‌వురా`(తెలుగు), `ప‌టాస్‌` (త‌మిళ్‌), `అదాబ్ ముతియ‌రాన్‌` (పంజాబి) చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… మెహ‌రీన్ నాయిక‌గా న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా పండ‌గ‌లనే టార్గెట్ చేసుకుని రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. గోపీచంద్‌కి జోడీగా మెహ‌రీన్ న‌టించిన `చాణ‌క్య‌` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుండ‌గా… క‌ళ్యాణ్ రామ్‌కి జంట‌గా మెహ‌రీన్ న‌టిస్తున్న `ఎంత మంచివాడ‌వురా` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న రాబోతోంది. మ‌రి… `మ‌హానుభావుడు` (2017 ద‌స‌రా), `రాజా ది గ్రేట్‌` (2017 దీపావ‌ళి), `ఎఫ్ 2` (2019 సంక్రాంతి) వంటి ఫెస్టివ‌ల్ హిట్స్‌తో ముందుకు సాగుతున్న మెహ‌రీన్‌కి… రాబోయే ఫెస్టివ‌ల్ రిలీజెస్ కూడా క‌లిసొస్తాయేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =