
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 71


సాయి తేజ్ `సుబ్రమణ్యం For సేల్’కి 4 ఏళ్ళు

`రాక్షసుడు` దర్శకుడితో రవితేజ చిత్రం?

సెప్టెంబర్ 24 కేరాఫ్ మెమరబుల్ మూవీస్
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!

'అ' డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..?

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!

'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ రిలీజ్

నటసింహ బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కు 25 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?

డేట్ ఫిక్స్ చేసుకున్న `అల వైకుంఠపురములో`?

‘శ్రీకారం’లో ప్రియాంక అరుళ్ మోహన్

గోపీచంద్‌కి జోడిగా తమన్నా?

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో 'డియర్ కామ్రేడ్'

చాణక్య రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీ హిట్ `ఠాగూర్`కు 16 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా పలు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చాయి. వాటిలో `ఠాగూర్` ఒకటి. లంచగొండి వ్యవస్థపై పోరాటం సాగించిన ఠాగూర్ అనే ఓ ప్రొఫెసర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. `ఇంద్ర` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత చిరు నటించిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. అంతేకాదు... ప్రస్తుతానికి చిరు కెరీర్‌లో ఇదే చివరి ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం. శ్రియ, జ్యోతిక కథానాయికలుగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీలో ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, సునీల్, కె.విశ్వనాథ్, ఎం.ఎస్.నారాయణ, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం…

సాయి తేజ్ `సుబ్రమణ్యం For సేల్’కి 4 ఏళ్ళు
మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్... ఇలా మెగా హీరోలతో హరీష్ తెరకెక్కించిన ప్రతీ సినిమా విజయం సాధించింది. అలా సక్సెస్ చూసిన చిత్రాల్లో... సాయితేజ్ హీరోగా నటించిన `సుబ్రమణ్యం For సేల్’ ఒకటి. రెజీనా నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అదా శర్మ, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, నరేష్, ఝాన్సీ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్న వెంకీ, తరుణ్ భాస్కర్ చిత్రం?
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం `మీకు మాత్రమే చెప్తా`లో కథానాయకుడిగా నటిస్తున్న తరుణ్... త్వరలో మరోసారి మెగాఫోన్ పట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్నాడు.

`రాక్షసుడు` దర్శకుడితో రవితేజ చిత్రం?
మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం `డిస్కో రాజా`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా... డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ లోపే `డాన్ శీను`, `బలుపు` చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు రవితేజ. అంతేకాదు... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ టాలెంటెడ్ హీరో.

సెప్టెంబర్ 24 కేరాఫ్ మెమరబుల్ మూవీస్
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకి, సెప్టెంబర్ 24కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఇదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో ఏయన్నార్ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా... ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా తనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ చిత్రాలే... `పల్నాటి యుద్ధం’, `ప్రేమనగర్`, `మేఘసందేశం’.
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

'అ' డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన ఐదో సినిమాను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

'గద్దల కొండ గణేష్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'గద్దల కొండ గణేష్' రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ గెటప్.. ఊరమాస్ యాక్టింగ్, హరీష్ శంకర్ టేకింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 13 కోట్లకుపైగా షేర్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ 15 కోట్లకు పైగా కోట్లు షేర్ కొల్లగొట్టింది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!
గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ రిలీజ్
హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది తాప్సీ. అంతే కాదు అక్కడ తాను చేస్తున్న సినిమాలు కూడా వరుస విజయాలు దక్కించుకుంటున్నాయి. ఇటీవలే తాను నటించిన మిషన్ మంగళ్ సినిమా కూడా హిట్ అయింది. ఇక ప్రస్తుతం తను 'సాండ్ కీ ఆంఖ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అవుతుంది.

నటసింహ బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కు 25 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలా విజయం సాధించిన సినిమాల్లో ‘బొబ్బిలి సింహం’ ఒకటి. బాలకృష్ణ సరసన రోజా, మీనా కథానాయికలుగా నటించగా ‘ఊర్వశి’ శారద, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, శరత్‌బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రాళ్ళపల్లి, సంగీత, సుధ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `దూకుడు` ఒకటి. ముఖ్యంగా... `పోకిరి` (2006) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సరైన విజయం లేని మహేష్‌కి ఐదేళ్ళ తరువాత `దూకుడు` రూపంలో మరో సెన్సేషనల్ హిట్ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... ఆ ఏటి మేటి చిత్రంగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే... ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి అక్కడ వెరీ ఫస్ట్ వన్ మిలియన్ డాలర్ టాలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డులకెక్కి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనిపించుకుంది. అంతేకాదు... `దూకుడు` తరువాత దాదాపు మహేష్ చిత్రాలన్నీ వన్…

చిరంజీవి, కొరటాల సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో… చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`... ఇలా క్యాచీ టైటిల్స్‌తోనే వరుస సినిమాలు చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి కూడా అదే శైలిని కొనసాగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘మనీ’ (1993) చిత్రంలోని “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు” పాట పల్లవిలో వినిపించే `సోలో బ్రతుకే సో బెటర్`అనే పంక్తితో సాయితేజ్ కొత్త సినిమా రాబోతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు నాయికలకు స్థానముండగా…

డేట్ ఫిక్స్ చేసుకున్న `అల వైకుంఠపురములో`?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం `అల వైకుంఠపురములో`. ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టబు, జయరామ్, నివేదా పెతురాజ్, నవదీప్, సుశాంత్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. బన్నీ, టబు, నివేదా పెతురాజ్, సత్యరాజ్ కాంబినేషన్‌లో కీలక…

‘శ్రీకారం’లో ప్రియాంక అరుళ్ మోహన్
'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ... ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న బన్నీ ?
‘నా పేరు సూర్య’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘అలా వైకుంఠపురములో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం... టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రాలు చేయనున్నాడు బన్నీ. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. కాగా... ఒకవైపు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంటూనే... మరోవైపు ఓ పాన్ ఇండియా ఫిల్మ్‌ను, ఓ బైలింగ్వల్ మూవీనికూడా ప్లాన్ చేస్తున్నాడట బన్నీ. ఈ నేపథ్యంలో... పాన్ ఇండియా ఫిలిం కోసం బన్నీ ఇప్పటికే కొంతమంది బాలీవుడ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నాడని వార్తలు…

గోపీచంద్‌కి జోడిగా తమన్నా?
దర్శకుడు సంపత్ నందికి కలిసొచ్చిన కథానాయిక తమన్నా. ఇది వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ మంచి విజయం సాధించాయి. మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఈ ఇద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రానుందని సమాచారం.

ఆస్కార్ ఎంట్రీ లిస్ట్ లో 'డియర్ కామ్రేడ్'
భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

చాణక్య రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈసారి గోపీచంద్ హిట్ కొట్టే ఛాన్సే కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయారు చిత్రయూనిట్. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.